Rhea Chakraborty: బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తి... 'తూనీగా.. తూనీగా మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.. అయితే బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి తర్వాత నిత్యం వార్తల్లోకి ఎక్కింది. ఇక సుశాంత్ వర్థంతి రోజున ఒక ఎమోషనల్ పెట్టింది. తాజాగా మంగళవారం ఉదయం ఓ సెల్ఫీని షేర్ చేసింది. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సెల్సీ ఫొటోను షేర్ చేసి 'రైజ్ అండ్ సైన్' అంటూ క్యాప్షన్ పెట్టింది.. రియా ఈ ఫొటోలో నవ్వుతూ కన్పించింది. చాలా రోజుల తర్వాత ఆమె నవ్వుతూ కన్పించిన ఫొటో షేర్ చెయ్యగా కొందరు సుశాంత్ అభిమానులు ఆ ఫోటోపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.