సమంత నటించిన సినిమాల్లోని డైలాగ్స్‌ను అనుకరిస్తూ డబ్‌స్మాష్‌లతో ఫేమస్ అయి.. అచ్చం సమంతలానే చేస్తుందంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మన్ననలు పొందిన అషురెడ్డి ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 3తో మరింత ఫేమస్ అయింది. ఈ మధ్య బుల్లి తెర షోల్లో తెగ కనిపిస్తున్న ఈ క్యూటీ ఇప్పుడు మరింత ఫేమస్ అయ్యేందుకో.. లేక తాను కూడా బోల్డ్ అనిపించుకునేందుకో దర్శకుడు ఆర్జీవీ క్యాంపుకు వెళ్లింది.
ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసే యాంకర్లు హాట్‌గా.. చిట్టిపొట్టి దుస్తులు ధరించి అతని వద్దకు వెళ్లడం ఈ మధ్య అలవాటుగా మారింది. పలు యూట్యూబ్ ఛానళ్ల యాంకర్లు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసేందుకు హాట్‌గా తయారయి వెళుతున్నారు. తాజాగా అషురెడ్డి కూడా రాంగోపాల్ వర్మ వద్దకు అలానే వెళ్లింది. అయితే.. ఆమె ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఏదో ఇంటర్వ్యూకు వెళ్లినట్టుగా అనిపిస్తోంది. కానీ.. ఆ వీడియోలో అషురెడ్డి ధరించిన దుస్తులు.. ఆమె చేస్తున్న ఎక్స్పోజింగ్.. రాంగోపాల్ వర్మ రియాక్ట్ అయిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వీడియోల మరో వివాదాస్పద విషయం ఏంటంటే.. ఆర్జీవీ తన హీరోయిన్ల అందాలను ఏ యాంగిల్స్‌లో చూపిస్తాడో అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌తో అషురెడ్డిని లో యాంగిల్లో ఫొటోలు, వీడియోలు తీస్తూ ఆర్జీవీ ఆ వీడియోలో కనిపించాడు. ఇంకేమంది.. నెటిజన్లు ఆ వీడియోపై విరుచుకుపడుతున్నారు. రాంగోపాల్ వర్మ మొదటి నుంచీ అంతే.. నీకేమైందంటూ అషురెడ్డిని తిట్టిపోస్తున్నారు. ట్రోల్ చేస్తూ సాగిన ఆ కామెంట్ల వర్షానికి తడిసి ముద్దయిన అషురెడ్డి వెటకారంగా ‘మీ కామెంట్స్‌కు థ్యాంక్స్’ అని రిప్లై ఇచ్చింది.