కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకయితే.. కనిపించని ఆ నాలుగే సింహమేరా పోలీస్ అనే డైలాగ్ మీకు గుర్తుంది కదా. ఇక వెండితెరపై పోలీస్ పాత్ర ఎవర్ గ్రీన్ ఫార్ములా. ఎంతో మంది ఒంటి మీద ఖాకీ డ్రెస్ వేసుకొని రఫ్పాడించారు. ఈ రోజు గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు సినిమాల్లో పోలీస్ పాత్రలు చేసిన హీరోలపై న్యూస్ 18 ప్రత్యేక కథనం.(Twitter/Photo)
ప్రెజెంట్ జనరేషన్ హీరోల విషయానికొస్తే...‘కొమురం పులి’ సినిమాలో పోలీస్ గెటప్‌లో కనిపించాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ సినిమా ప్లాప్ అయింది. ఆ తరువాత ఖాకీ డ్రెస్‌కు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. హారిష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మూవీ కోసం ఖాకీ డ్రెస్ వేసుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. (Twitter/Photo)
‘పోకిరి’ సినిమాకోసం తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసి హిట్ కొట్టాడు మహేశ్. ఆ తరువాత ‘దూకుడు’ సినిమా కోసం మరో సారి ఖాకీ డ్రెస్ వేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ముచ్చటగా మూడో సారి మహేష్ తొడిగిన ఖాకీ డ్రెస్ మాత్రం కలిసి రాలేదు. ‘ఆగడు’లో ఖాకీ డ్రెస్ వేసిన మహేష్‌కు పరాజయం పాలైంది.(Twitter/Photo)
రామ్ చరణ్ హిందీలో చేసిన సినిమా కూడా పోలీస్ స్టోరీనే. ఈ సినిమాను తెలుగులో ‘తుపాన్’గా డబ్బింగ్ చేశారు. ఈ సినిమాలో ఫస్ట్ టైం పోలీస్ డ్రెస్ లో కనిపించిన చరణ్.. ఈ మూవీతో ప్లాప్‌ని మూట కట్టుకున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ‘ధృవ’ మూవీతో పోలీస్ ఆఫీసర్‌గా తన పవరేంటో చూపెట్టాడు. (Twitter/Photo)