Remya Nambeesan : మలయాళ, తమిళ ప్రేక్షకుల్ని అలరిస్తూ... 50కి పైగా సినిమాలు చేసింది రెమ్యా నంబీసన్. ఆమె స్వయంగా 20 పాటలు కూడా పాడటం విశేషం. 2000లో మలయాళ సినిమా సయానమ్తో... చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాలీవుడ్‌లో ఎంటరైన ఈ భామ... 2006లో ఆనాచందంలో హీరోయిన్గా చేసింది. అలాగే 2005లో ఒరు నాల్ ఒరు కనావూతో... కోలీవుడ్‌లో ప్రవేశించింది. ట్రాఫిక్ (2011), చప్ప కురిష్ (2011) సినిమాల్లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రెమ్యా... పిజ్జా (2012), లెఫ్ట్ రైట్ లెఫ్ట్ (2013), ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ (2013), జిలేబీ (2015), సత్య (2017), మెర్క్యురీ (2018) వంటి సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించింది. ఇన్ని సినిమాలు చేసి కూడా... రెమ్యా అప్పుడప్పుడూ టీవీలో ప్రజెంటర్‌గా చేస్తుండటం విశేషం.