తెలుగు ఇండస్ట్రీలో నవ్వు ఉన్నన్నాళ్లూ గుర్తుండిపోయే పేరు హాస్యనట చక్రవర్తి రాజబాబు. ఆ నవ్వుకే నవ్వు తెప్పించిన కమెడియన్ ఈయన. ఒకప్పటి లెజెండరీ కమెడియన్.. ఎవర్ గ్రీన్ నటుడు.. అంతకంటే మంచి మనిషి. ఉన్నదాంట్లోనే సాయం చేయడం కాకుండా అప్పులు తెచ్చి మరీ అందరి చేత మెప్పు పొందిన అద్భుతమైన మనిషి రాజబాబు. ఫిబ్రవరి 14న ఆయన 39వ వర్ధంతి.
వాళ్లకు ఇండియాతో పాటు అమెరికాలోనూ ఆస్తులున్నాయని.. అక్కడ వాళ్ల సొంత సాఫ్వేర్ కంపెనీ పెట్టుకుని పిల్లలిద్దరూ హాయిగా ఉన్నారని చెప్పారు. కేవలం కంపెనీ విలువే 30 కోట్ల వరకు ఉంటుందని.. వాటితో పాటు మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు చిట్టి బాబు. ఏదేమైనా అంత సంపాదించి అనుభవించకుండా వెళ్లిపోయారనేది బాధ అంటూ అన్నయ్యను తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు చిట్టిబాబు.