Soundarya Biopic: సౌందర్య బయోపిక్ రాబోతుందా.. లెజెండరీ హీరోయిన్ పాత్రలో నేటి మహానటి..?

Soundarya Biopic: నాటి మహానటి సావిత్రి(Mahanati Savitri) ఎలా ఉంటుందో ఈ తరం ప్రేక్షకులకు తెలియదు. అందుకే నాగ్ అశ్విన్ సినిమా రూపంలో ఆమెకు నీరాజనం ఇచ్చాడు. అలాగే ఇప్పటి తరం ప్రేక్షకులకు సౌందర్య (Soundarya Biopic) అనే హీరోయిన్‌తో పరిచయం లేదు. ఈమె చనిపోయి 17 ఏళ్ళు పూర్తైపోయింది. జులై 18న ఈమె 49వ జయంతి. తాజాగా ఈమె జయంతి సందర్భంగా బయోపిక్ గురించి మరోసారి చర్చకు వచ్చింది.