ముంబై ఇండియన్స్ జట్టుతో ముఖేష్ అంబానీ కుటుంబం దీపావళి సంబరాలు

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ముంబై ఇండియన్స్ జట్టుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ జియో వరల్డ్ సెంటర్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో పాల్గొనేందుకు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీతో పాటు కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు సభ్యులు సైతం పాల్గొన్నారు.