హాలీవుడ్ సినిమా అవతార్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ సినిమాను సినీ ప్రియులెవరూ మరిచిపోలేరు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ (James Cameron) తన దర్శకత్వ ప్రతిభతో పండోరా అంటూ కొత్త ప్రపంచమే చూపించాడు. 2009లో వచ్చిన ఈ గొప్ప విజువల్ వండర్ 'అవతార్'కు సీక్వెల్గా వస్తున్న మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (Avatar: The Way of Water )
ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. దీంతో ప్రచారంలో భాగంగా టీమ్ ఇప్పటికే ఓ ట్రైలర్ను విడుదల చేయగా.. ఇక తాజాగా మరో ట్రైలర్ను (Avatar: The Way of Water Trailer) విడుదల చేసింది. ఈ సరికొత్త ట్రైలర్ కూడా అదిరిపోయింది విజువల్ వండర్ అని చెప్పోచ్చు. Avatar 2 Trailer Photo : Twitter
“అవతార్” కి సీక్వెల్ గా దాదాపు 13 ఏళ్ల తర్వాత రిలీజ్ కాబోతుంది. మరి ఇప్పుడు “అవతార్ ది వే ఆఫ్ వాటర్” గా రిలీజ్ కి రెడీ చేసిన ఈ చిత్రం రీసెంట్ గానే ఇండియాలో బుకింగ్స్ ని కూడా ఓపెన్ చేసుకుంది. కొన్ని చోట్ల మాత్రమే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అవతార్ టీంకు షాక్ తగిలింది.
థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రీబూట్యర్స్ ల మధ్య ఒప్పందం కాకపోవడమే కారణమని తెలిపింది. కానీ మిగిలిన సినిమాలు మాత్రం కేరళ వ్యాప్తంగా ప్రదర్శితమవుతాయని ప్రకటించారు. డిస్టిబ్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ మధ్య అవాతార్ సినిమా కోసం డిస్టిబ్యూటర్స్ మొదటి వారంలోని కలెక్షన్లలలో 60 శాతం లాభాలను అడుగుతున్నారని కానీ ఓనర్స్ మాత్రం కేవలం 55 శాతం లాభాలు ఇస్తామని చెప్పడంతో ఒప్పందము కుదరలేదని అన్నారు.