బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత రెబల్ స్టార్ అన్ని ప్యాన్ ఇండియా సబ్జెక్ట్స్ ఉన్న స్టోరీలనే చేస్తన్నాడు. ఈ రూట్లనే ఈయన హీరోగా నటించిన రాదే శ్యామ్ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఇక ఈయన హీరోగా నటించిన ’రాధే శ్యామ్’ సినిమా మరికాసేట్టో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ఎయిర్ కాబోతోంది. (Twitter/Photo)
మంచి విజువల్ వండర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. బాహుబలి (Bahubali) తర్వాత వరసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్ (Prabhas). అయితే ఆ స్థాయి విజయం మాత్రం అందుకోలేదు ఈయన. మూడేళ్ల కింద వచ్చిన సాహో (Saaho) తెలుగులో ఫ్లాప్ అయింది కానీ హిందీలో మాత్రం మంచి విజయం సాధించింది.
ఈ సినిమా ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన మూడు వారాలకే ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక హిందీ వెర్షన్ రాధే శ్యామ్ మాత్రం నెట్‌ప్లిక్స్‌లో విడుదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ లవ్ స్టోరీగా వచ్చింది ‘రాధే శ్యామ్’.
మార్చ్ 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. మొదటి రోజే టాక్ తేడాగా రావడంతో కలెక్షన్స్ కూడా దారుణంగా పడిపోయాయి. రూ. 100 కోట్లకు పైగా షేర్ వచ్చింది కానీ జరిగిన బిజినెస్ 200 కోట్లకు పైగా ఉండటంతో డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. అయితే సినిమాకు ఓ వర్గం నుంచి మాత్రం మంచి టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జీ టీవీలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. అంతేకాదు కలలో కూడా కలవకూడని ఇద్దరు విధిని ఎదురించి కలిస్తే ఏమవుతుందో అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను ప్రసారం చేయనున్నారు. (Twitter/Photo)
ముఖ్యంగా స్లో గా ఉన్నా కూడా ప్రేమకథలను ఇష్టపడే వాళ్లకు మాత్రం రాధే శ్యామ్ మంచి ఛాయిస్. ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చాలా బాగానే రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. భాషతో సంబంధం లేకుండా అన్నిచోట్ల ఈ సినిమాకు కలెక్షన్స్ పెద్దగా రాలేదు. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఈ సినిమా టీవీల్లో ఎంత మేరకు టీఆర్పీ రాబడుతుందో చూడాలి. (Twitter/Photo)