Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ పిక్స్.. సోషల్ మీడియాలో వైరల్.. తాజాగా సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాను ప్రభాస్ తనదైన శైలిలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభాస్, సుధీర్ చిట్‌చాట్ చేసిన ఫోటోలను అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. (Twitter/Photo)
అశ్వనీదత్ వైజయంతి మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్‌తో పాటు నాని, విజయ్ దేవరకొండ కూడా నటించబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న సినీ వర్గాలు చెబుతున్నాయి. (Twitter/Photo)