ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ రెండు సినిమాలతో ప్రభాస్ క్రేజ్ లోకల్ లెవల్ నుంచి గ్లోబల్ లెవల్‌కి పెరిగింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా సాగిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా తెలుగులో ఫ్లాప్ టాక్ వచ్చినా.. నార్త్ రీజియన్‌లో రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఔరా అనిపించింది.’సాహో’ విడుదలైన రెండేళ్ల తర్వాత ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ మరో కొన్ని గంటల్లో విడుదల కానుంది.Pooja hegde Instagram
పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వసూళ్లు అదిరిపోయే అవకాశాలున్నాయి. మొత్తంగా అక్కడ ఈ సినిమాను రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తాజాగా రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన ప్రీమియర్స్‌ను హైదరాబాద్ కూకట్పల్లి థియేటర్స్‌లో ప్రదర్శించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీమియర్స్ టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. (File/Photo)
తెలుగు రాష్ట్రాల్లో కచ్చితంగా రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్స్ రాబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగులో దాదాపు 1800 థియేటర్స్‌లో విడుదల కానుంది రాధే శ్యామ్. అంటే ఉన్న థియేటర్స్‌లో దాదాపు 85 శాతం ఇదే ఉండబోతుందన్నమాట.ఏపీలో టికెట్ రేట్లు కూడా ఓ కొలిక్కి రావడంతో కచ్చితంగా రికార్డు ఓపెనింగ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి.
మొత్తంగా బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక స్క్రీన్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తన కెరీర్లో రొమాన్స్ చేసిందే తక్కువ. ఎప్పుడూ విలన్స్‌ను ఉతికి ఆరేయడమే కానీ.. హీరోయిన్లకు పువ్వులు ఇచ్చి.. వెంటబడే సినిమాలు అరుదుగా జరుగుతుంటాయి. అలాంటిదిప్పుడు రాధే శ్యామ్ పూర్తిగా ప్రేమకథ. ఇందులో ట్రెండ్‌కు తగ్గట్లు ముద్దు సీన్స్ కూడా ఉన్నాయట.
ప్రభాస్ .. ‘రాధే శ్యామ్’ విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ ఓ రేంజ్లో ఉండబోతుందనే విషయం ట్రైలర్లో చూపించారు. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉంది. తాజాగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఎంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంటే.. (File/Photo)
కర్ణాటక: రూ. 12.50 కోట్లు తమిళనాడు: రూ. 6 కోట్లు కేరళ: రూ. 2.10 కోట్లు హిందీ: రూ. 50 కోట్లు రెస్టాఫ్ ఇండియా: రూ. 3 కోట్లు ఓవర్సీస్ : రూ. 24 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 204 కోట్ల రాబట్టాలి. (Twitter/Photo)
ఇక ఈ సినిమాలో విజువల్ వండర్ అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. దాదాపు 10కి పైగా భాషల్లో విడుదల కానుంది. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. మనుషుల చేతి రేఖలు చూసి జాతకం చెప్పే హస్త సాముద్ర యువకుడి పాత్రలో నటించారు.
యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి వర్క్ అదనపు ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. మార్చ్ 11, 2022న సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ జ్యోతిషం చెప్పించుకున్నారు. ఈ సినిమాలో వివిధ దేశాధినేతలు, ప్రధానులకు, వివిధ ప్రముఖులకు జ్యోతిషం చెప్పే హస్త సాముద్రకుడి పాత్రలో ఒదిగిపోయారు ప్రభాస్. రాధే శ్యామ్ మూవీ క్లైమాక్స్ హాలీవుడ్ మూవీ టైటానిక్ క్లైమాక్స్‌ను మించి ఈ సినిమాలో క్లైమాక్స్ ఉండబోతుందని అంటున్నారు.ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్‌కు ఓ రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు రాజమౌళి వాయిస్ ఓవర్ అందించారు.