Rebel Star Prabhas | ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్‌తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలను స్టార్ట్ చేసారు. దాంతో పాటు మారుతి, సందీప్ రెడ్డి సినిమాలతో మరో ఇద్దరు దర్శకులు లైన్లో ఉన్నారు. ఇక రాధే శ్యామ్ విషయానికొస్తే.. ఈ చిత్రాన్ని గతేడాది మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo) =
అసలు ‘రాధే శ్యామ్’ తర్వాత ప్రభాస్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్‌తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలను స్టార్ట్ చేసారు. ఇక ఓం రౌత్‌తో చేసిన ఆది పురుష్ సినిమా షూటింగ్ ఎపుడో కంప్లీటైంది. అంతా బాగుంటే ఈ పాటికే ఈ సినిమా విడుదలయ్యేది. కానీ గ్రాఫిక్స్ విషయంలో తేడా కొట్టడంతో ఈ సినిమాను సంక్రాంతి నుంచి తప్పుకొని ఈ యేడాది 16 జూన్ న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (File/Photo)
రెబల్ స్టార్ ప్రభాస్ ఓకే చేసిన చిత్రాల్లో ప్రశాంత్ నీల్ ‘సలార్’ సినిమా ఒకటి. భారీ క్యాస్టింగ్తోపాటు కొత్త నటీనటులతో ప్రశాంత్ నీల్ ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని సింగరేణిలో ప్రారంభించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. ఈ సినిమాను ఈ ఇయర్ 28 సెప్టెంబర్న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
’సలార్’ దాాదాపు కంప్లీట్ కావడంతో మారుతితో ప్రభాస్ ఓ లో బడ్జెట్ మూవీ చేయనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’ అనే పేరు ఖరారు చేశారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. జూలై వరకు ఈ సినిమాను కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. హార్రర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. (File/Photo)
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. 2024 సమ్మర్లో మొదటి భాగం.. దసరాకు రెండో భాగం విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అమితాబ్, దీపికా పదుకొణే, దిశా పటానీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. 2024 సమ్మర్లో మొదటి భాగం.. దసరాకు రెండో భాగం విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాను రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అమితాబ్, దీపికా పదుకొణే, దిశా పటానీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. (Twitter/Photo)
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమాకు చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. ఈ యేడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రభాస్ 25వ మూవీగా రానుంది. అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగా తెలుగులో డైరెక్ట్ చేస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. (File/Photo)
రీసెంట్గా సిద్ధార్ధ్ ఆనంద్.. షారుఖ్ ఖాన్‌తో ‘పఠాన్’ మూవీతో మరో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత హృతిక్ రోషన్‌తో ‘ఫైటర్’ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రభాస్, హృతిక్ రోషన్లతో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించబోతుంది. (Twitter/Photo)
సూర్యతో ‘ఆకాశం నీ హద్దురా’ టైపులో ప్రభాస్‌తో సుధ కొంగర ఓ బయోపిక్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. భారత దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తి జీవితాన్ని ప్రభాస్‌తో తీయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె హిందీలో ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేస్తున్నారు. వీళ్లిద్దరి కలయికలో తెరకెక్కబోయే సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)