ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాధే శ్యామ్ ట్రైలర్ లాంచ్ చేశారు. రాధే శ్యామ్ ట్రైలర్ రొమాంటిక్ గా మొదలై ఎమోషనల్ గా ముగించారు. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథ ఎలా ముగిసింది.. ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ మనుషుల చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పే వాడిగా కనిపించనున్నారు. (Twitter/Photo)
ట్రైలర్ ప్రభాస్ డైలాగ్ తో ప్రారంభం అవుతుంది. "రేయ్ అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ, పెళ్లి లేవని" అంటూ ప్రభాస్ ఆసక్తికరమైన డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రభాస్, పూజా హెగ్డే మధ్య రొమాంటిక్ ట్రాక్ మొదలవుతుంది. అద్భుతమైన లొకేషన్స్ లో అన్ని సన్నివేశాలని దర్శకుడు రాధా కృష్ణ కలర్ ఫుల్ గా తెరకెక్కించాడు. విజువల్ వండర్ అనిపించే షిప్, సముద్రపు సన్నివేశాలు కూడా ఉన్నాయి.. (Twitter/Photo)
అసలు ఎవరీ గుడ్ లుకింగ్ బ్యాడ్ ఫెలో అని పూజా హెగ్డే చెప్పగానే కృష్ణం రాజు స్వామిజీ గా ఎంట్రీ ఇస్తారు. ప్రభాస్ విక్రమాదిత్య పాత్ర గురించి కృష్ణం రాజు చెప్పే డైలాగులు అంచనాలు పెంచేస్తున్నాయి. 'ది డ్రెస్ విక్రమాదిత్య.. పామిస్ట్రీలో అతడు ఐన్ స్టీన్. ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్త సాముద్రిక నిపుణుడు' అంటూ కృష్ణం రాజు డైలాగులు చెబుతారు.హిందీ మిగతా భాషల్లో ఈ పాత్రను బాహుబలి కట్టప్ప ఫేమ్ సత్యరాజ్ చేశారు. (Twitter/Photo)
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’.పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మొదలయ్యి దాదాపు మూడేళ్లు అవుతుంది. అంతకు రెండేళ్ల నుంచి ఈ సినిమా కోసం పనిచేశారు దర్శకుడు రాధా కృష్ణ కుమార్. మొత్తంగా ఒక సినిమా కోసం ఐదేళ్ల కేటాయించడం మాములు విషయంల కాదని ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పారు. ‘రాధే శ్యామ్’ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ఱంరాజు పరమహంసగా కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.(Twitter/Photo)
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ప్రభాస్ మాట్లాడుతూ.. తన ఇంటి బ్యానర్ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై గతంలో పలు ఉత్తమ చిత్రాలొచ్చాయి. ఈ బ్యానర్లో ‘రాధే శ్యామ్’ సినిమా చేయడాన్ని గర్విస్తున్నాం అన్నారు. కోవిడ్ సమయంలో ఈ చిత్ర బృందం ఎంతో కష్టపడిందన్నారు. ఈ సినిమాను ఇటలీ, జార్జియా, మన దేశంలో చిత్రీకరించమన్నారు ప్రభాస్. (Twitter/Photo)
మరోవైపు ఈ సినిమాకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన మనోజ్ చాలా అద్భుతంగా ఓ దృశ్య కావ్యంగా ‘రాధే శ్యామ్’ మూవీని తీర్చిదిద్దరన్నారు ప్రభాస్. ఈ మూవీ దర్శకుడు రాధాకృష్ణ ఐదేళ్ల పాటు ఈ సినిమా కోసం పనిచేయడం ఆయన ఓపికను నిదర్శనం అన్నారు.. సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుందన్నారు. అభిమానుల వల్లే ఈ కార్యక్రమం ఇంతా బాగా జరిగిందన్నారు ప్రభాస్. (Twitter/Photo)