ఇప్పటికే ఈ సినిమా 70 శాతం వరకు షూట్ పూర్తి చేసుకుందని తెలుస్తోంది. అది అలా ఉంటే ఈ సినిమా విషయంలో ఓ ఖతర్నాక్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇక విషయంలోకి వస్తే.. ఈ సినిమా నైజాం థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా నైజాం హక్కులను ఏషియన్ సంస్థ రూ. 70 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక తాజాగా మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్’లో చిత్రబృందం భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. అంతేకాదు ఈ యాక్షన్ సీన్స్‌ను షూట్ చేయడానికి చిత్రబృందం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది.. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా భారతీయ ఇతిహాసం మహాభారతం స్పూర్తితో మూడో ప్రపంచ యుద్దం నేపథ్యంలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ సినిమా అని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు. ఇక ఈ భారీ చిత్రంలో సుదీర్ఘమైన ఐదు యాక్షన్ బ్లాకులు ఉన్నాయట. ఈ యాక్షన్ సీన్స్‌ను ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని రీతిలో తెరకెక్కిస్తున్నారట నాగ్ అశ్విన్.. అందులో భాగంగానే హాలీవుడ్ నుంచి ఓ నలుగురు యాక్షన్ డైరెక్టర్లను దించనున్నారట. Photo : Twitter
ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీపికా పదుకొణే హీరోయిన్గా నటిస్తోంది.రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘ప్రాజెక్ట్ K’(Project K) . ఈ సినిమాను నాగ్ అశ్విన్ ప్యాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ముందుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా ట్రయల్ షూట్ కూడా నిర్వహించారు.
ప్యాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి గ్రాఫిక్స్ ఇతరత్రా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు చాలా సమయం కావాలి. అందుకే ఈ సినిమా షూట్ కంప్లీటైన 10 నెలల తర్వాత ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. అప్పట్లో వినాయక చవితి సందర్భంగా విడుదల చేసిన పోస్ట్‌లో ఒకప్పుడు సాయం చేసావు. ఈ సారి మా భారతానికి కూడా ఆశీర్వాదం కావాలని పోస్ట్ చేశారు. (Twitter/Photo)
మొత్తంగా ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. ఈ సినిమాను మహా భారత గాథ ఆధారంగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక ప్రాజెక్ట్ K అంటే ప్రాజెక్ట్ కర్ణ అని టాక్ వినబడుతోంది. మొత్తంగా ఇపుడు ప్రాజెక్ట్ K ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్.. అమితాబ్ బచ్చన్‌గారితో మొదటిసారి నటించడంతో తన చిరకాల కోరిక నెరవేరిందన్నారు.
ఈ సినిమాను ముందుగా నటరత్న అన్నగారైన ఎన్టీఆర్ ‘యుగంధర్’ కూడా రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. షారుఖ్ ఖాన్... బిగ్ బీ మూవీ డాన్‌ను అదే పేరుతో రీమేక్ చేశారు. తరువాత సీక్వెల్స్ తీసే పనిలో పడ్డాడు. అలాగే ‘డాన్’కి రీమేక్ గానే తమిళంలో రజినీకాంత్ ‘బిల్లా’ చేశారు. ఆ సినిమానే అజిత్ సరికొత్తగా అదే టైటిల్ ‘బిల్లా’పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. చివరగా తెలుగులో ప్రభాస్ కూడా ‘బిల్లా’గా మారాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.