Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు.. హీరోగా ప్రత్యేకమైన మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్న కథానాయికుడు. హీరోగా కెరీర్ మొదలు పెట్టి.. ఆ పై విలన్ గా మారి.. ఆపై కథానాయకుడిగా రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈయన గతేడాది సెప్టెంబర్ 11న కన్నుమూసారు. నేడు కృష్ణంరాజు జయంతి సందర్భంగా న్యూస్ 18 ప్రత్యేక కథనం.. (Twitter/Photo)
వ్యక్తిగా అందమైన చిరునవ్వు, చక్కని పలకరింపు, కళ్లల్లో నిజాయితీ కృష్ణం రాజు సొంతం..చేసిన ప్రతి పాత్రకూ తనదైన పర్ఫార్మెన్స్ తో న్యాయం చేయగల సత్తా, పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నేర్పు కృష్ణంరాజు ప్రత్యేకతలు..,. చూడగానే అకట్టుకునే రూపం, నడక, నడతలో రాజసం ఉట్టిపడే విధానం...ఇవన్ని కృష్ణం రాజును హీరో గా నిలబెట్టాయి. హీరోయిన్స్ తో డ్యుయేట్ పాడినా, విలన్‌తో ఫైట్ చేసిన, ఫ్యామిలీలో అనురాగాలు పంచినా సిల్వర్ స్ర్కీన్ కు నిండుతనాన్ని తీసుకొచ్చిన నటుడు కృష్ణంరాజు.. (Twitter/Photo)
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు..ఈయన 1940 జనవరి 20 న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 2022 సెప్టెంబర్ 11న తుది శ్వాస విడిచారు. ఈయన వయసు 82 యేళ్లు. 1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో హీరోగా సినీరంగప్రవేశం చేసిన ఈయన ఈ యేడాది తన తమ్ముడు తనయుడు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ సినిమాలో ముఖ్యపాత్రలో అలరించారు. ఆజానుబాహుడైన కృష్ణంరాజు..మొదట హీరోగా పరిచయమైనా..తరువాత చేసినవన్నీ విలన్ పాత్రలే...అయినా ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి తిరిగి హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. ఎన్ టి .ఆర్, ఎ.ఎన్ ఆర్ తర్వాత రెండోతరం హీరోలైన కృష్ణ, శోభన్ బాబు తర్వాత తనకంటూ గుర్తుంపును, స్థానాన్ని సంపాదించుకున్న హీరో కృష్ణంరాజు. (Twitter/Photo)
‘జీవన తరంగాలు’ సినిమాతో హీరోగా తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. కృష్ణంరాజు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో కృష్ణంరాజుకు తిరుగులేకుండా పోయింది. 1977లో కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘అమరదీపం’ కృష్ణంరాజు కేరీర్ లో బెస్ట్ మూవీ గా నిలిచింది. ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, రాష్ట ప్రభుత్వం ఇచ్చే నందిఅవార్డునూ అందుకున్నారు. (File/Photo)
అన్ని రకాల పాత్రలతో మెప్పించిన ఇయన రౌద్రంరసం పండించడంలో తనకుతనే సాటి అనిపించుకున్నారు.. కళ్లల్లో నిప్పులు కురుపిస్తు తనదైన మాడ్యులేషన్ లో చెప్పే డైలాగ్స్ తో రెబల్ స్టార్ అనిపించుకున్నారు. కృష్ణంరాజు సొంతంగా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ స్థాపించి తన తమ్ముడు ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు నిర్మాతగా ఈయన సమర్పణలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఈ బ్యానర్ లో మొదటగా వచ్చిన మూవీ ‘కృష్ణవేణి’. వి. మధుసూదన రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా వచ్చిన ఈ సినిమా గోపీకృష్ణ బ్యానర్ కు కృష్ణంరాజుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ కన్నడలో హిట్టైన ఓ మూవీ రీమేక్. (Twitter/Photo)
కృష్ణం రాజు నటించిన సినిమాల్లో బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం, ధర్మాత్ముడు, కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులులాంటి ఈయనకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాలు. కటకటాల రుద్రయ్య, మనవూరిపాండవులు పదిరోజుల గ్యాప్ లోనే రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇలా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న హీరోగా అరుదైన ఫీట్ సాధించాడు. కటకటాల రుద్రయ్య అప్పట్లోనే రూ. 75 లక్షల గ్రాస్ ను వసూల్ చేసి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేసింది. (Twitter/Photo)
సాంఘీక చిత్రాలే కాకుంగా భక్తి రస చిత్రాలు, పౌరాణిక చిత్రాలలో నటించి అభిమానులను, ప్రేక్షకులను తన ఫర్పార్మెన్స్ తో అకట్టుకున్నారు. విశ్వనాథనాయకుడు సినిమాలో శ్రీకృష్ణ దేవరాయలుగా, కురుక్షేత్రంలో కర్ణుడుగా, శ్రీ వినాయక విజయంలో శివుడుగా, భక్త కన్నప్ప సినిమాలో శివ భక్తుడు తిన్నడు (కన్నప్ప)గా మెప్పించాడు. బాపు దర్శకత్వంలో వచ్చిన భక్త కన్నప్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి కృష్ణంరాజు కెరీర్ లోనే మరో బెస్ట్ మూవీగా నిలిచింది. (Twitter/Photo)
గొపీ కృష్ణ మూవీస్ బ్యానర్ లోనే భక్త కన్నప్ప, అమర దీపం, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపా రాయుడు లాంటి సూపర్ డూపర్ చిత్రాలు వచ్చాయి..బొబ్బిలి బ్రహ్మన్నలో అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయంతో ఆకట్టుకుంటే, అమరదీపం సినిమాతో నటుడుగా అవార్డు అందుకున్నారు. మంచి కథ, కథనాలతో వినసొంపైన సంగీతంతో ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండే సినిమాలను అందించిన ఘనత సాధించించి గోపీకృష్ణ బ్యానర్‌కే దక్కుతుంది. ఈయన ఎక్కువ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో చేసిన చిత్రాలు ఈయనకు పేరు తీసుకొచ్చాయి. (Twitter/Photo)
చనిపోయే వరకు సినిమాల్లో ఎక్కువగా నటించికపోయినా అడపాదడపా కనిపించి అభిమానులకు సంతృప్తి పరుస్తున్నారు.. అలా ఆ మధ్య కాలంలో చేసిన చిత్రం రుద్రమదేవి. ఈ చిత్రంలో గణపతి దేవుడిగా మరోసారి తన గంభీరమైన నటనతో ప్రేక్షుకుల్ని మెప్పించారు. ఇక చివరగా తన తమ్ముడు తనయుడు ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’లో స్వామిజీ పాత్రలో చివరగా కనిపించారు. (Twitter/Photo)