మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'ఆచార్య' (Acharya). ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిరంజీవి (Chiranjeevi ), రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా కావడం వల్ల ‘ఆచార్య’ (Acharya)పై మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ(Koratala Siva) డైరెక్షన్లో రావడం కూడా అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ఈ సినిమాకు మొదటి షోనుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని, గ్రాఫిక్స్ చెత్తగా ఉన్నాయని.. ఇద్దరూ స్టార్స్ ఉన్నా సినిమా ఎక్కడా కనెక్ట్ అవ్వడం లేదని టాక్ వచ్చింది. ఇక అదే కలెక్షన్స్ విషయంలో కూడా కనిపించింది. Photo : Twitter
అయితే ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోకపోవడానికి అసలు కారణాలు ఏంటీ అంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ చర్చించుకుంటున్నారు.. అవేంటో చూద్దాం.. ముఖ్యంగా.. చిరంజీవి,కాజల్‌తో మొదలైన సినిమా రామ్ చరణ్ పూజా హెగ్డేలా సినిమాగా మారిపోవడం.. కథలో కొత్తదనం లేకపోవడం, ఏ మాత్రం ఎంగేంజింగ్ కథను అల్లుకోకపోవడం, ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా ట్రైలర్ కట్ చేయడం. ఇద్దరూ స్టార్ హీరోలు ఉన్నప్పుడు సరైనా ఎలివేషన్ మిస్ అయ్యాయని అంటున్నారు. Photo : Twitter
సంగీతం విషయానికి వస్తే.. పాటలు ఒకటి రెండు పర్వాలేదనిపించాయి. కానీ ఓ రేంజ్లో మాత్రం వైరల్ కాలేదు.. బజ్ రాలేదు. ఇక బ్యాగ్‌గ్రౌండ్ స్కోర్ అనుకున్నంత రేంజ్లో లేదని అంటున్నారు. కథ దాదాపు ఒకే చోట జరగడంతో పాటు.. 90 80 నాటి పాత చింతకాయ పచ్చడిలా ఉందని అంటున్నారు. వీటన్నికి తోడు ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్, కెజియఫ్ 2 వంటి సూపర్ కాంటెంట్ ఉన్న సినిమాలను చూసిన జనాలు.. ఆచార్యను ఆ రేంజ్లో ఊహించుకోవడంతో.. అంచనాలు తప్పాయి. దీంతో మౌత్ టాక్ కారణంగా ఒక్కసారిగా సినిమా పడిపోయిందని అంటున్నారు. Photo : Twitter
ఇంకో పెద్ద లోపం గ్రాఫిక్స్. సినిమాలో కొన్ని కొన్ని చోట్ల గ్రాఫిక్స్ చాలా పేలవంగా ఉన్నాయని అంటున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే.. చిరంజీవి అసలు బలం ఫైట్స్ కాదు. ఆయన హిట్ సినిమా ఏది తీసుకున్నా ఎమోషన్స్, చక్కని హాస్యం, రొమాన్స్. అయితే ఆచార్య సినిమాలో ఇవి సరైనా మోతాదులో లేకపోవడం కూడా ఓ లోపమని.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించారు. రామ్ చరణ్ (Ram Charan) సిద్ద పాత్రలో అదరగొట్టారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) జోడిగా నటించగా ఆ తర్వాత ఆమె పాత్రను తొలగించారు దర్శక నిర్మాతలు. Photo : Twitter
ఇక రామ్ చరణ్‌కు జోడిగా పూజా హెగ్డే (Pooja Hegde) నటించారు. ఇక ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్టు సమాచారం.ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) భారీ రేటుకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఈ డీల్‌కు సంబంధించిన అన్ని అగ్నిమెంట్స్ కూడా పూర్తైయినట్టు సమాచారం. ‘ఆచార్య’ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత ‘ఆచార్య’ సినిమా స్ట్రీమింగ్ కానుందని టాక్. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఒక ప్రత్యేక సాంగ్ లో హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో ఆడిపాడింది. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలను చేస్తున్నారు. ఆయన మలయాళీ లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ (God father) అనే పేరును ఖరారు చేశారు. ఆయన ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా (Mohan Raja) డైరెక్షన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకానుందని సమాచారం. Photo : Twitter
ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ వేదాళం రీమేక్ భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. Photo : Twitter
ఈ రెండు సినిమాలతో పాటు బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేయనున్నారు చిరంజీవి. ఇక మరోవైపు చిరంజీవి తాజాగా మరో సినిమాకు ఓకే అన్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా దాదాపుగా ఖరారు అయ్యిందని అంటున్నారు. మలయాళంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోలుగా నటించిన ‘బ్రో డాడీ’ (Bro Daddy) సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని టాక్. మలయాళంలో తండ్రీ కొడుకులుగా మోహన్ లాల్ (Mohan Lal), పృథ్వీరాజ్ సుకుమార్ (Prithviraj Sukumaran) పాత్రలను తెలుగులో చిరంజీవి, సాయి ధరమ్ (Sai Dharam Tej) తేజ్ కలిసి చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిరంజీవి. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. Photo : Twitter