Home » photogallery » movies »

REASON BEHIND TAMANNAH BHATIA ACTIVE PROMOTION IN SYE RAA MOVIE AK

Tamannah: సైరాకు తమన్నా ఫుల్ సపోర్ట్... మిల్కీ బ్యూటీ స్కెచ్ ఏంటీ ?

సైరా సినిమాలో మెయిన్ హీరోయిన్ నయనతార అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో మాత్రం తమన్నానే ఎక్కువగా కనిపిస్తోంది. చిరంజీవితో కలిసి ప్రమోషన్స్‌లో ఎక్కువగా పాల్గొంటోంది కూడా ఈ మిల్కీ బ్యూటీనే. సినిమాలో ఆమె పాత్ర లెంగ్త్ తక్కువే అయినా... రామ్ చరణ్, చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం కారణంగా సైరా ప్రమోషన్స్‌కు ఫుల్లుగా సపోర్ట్ చేస్తోంది తమ్మూ. అయితే తమన్నా మెగా ఫ్యామిలీకి సైరా విషయంలో ఈ రేంజ్‌లో సపోర్ట్ చేయడాన్ని చూస్తున్న సినీవర్గాలు... ఆమెకు చిరంజీవి, చరణ్ నటించబోయే తదుపరి సినిమాల్లోనూ ఏదో రకంగా అవకాశాలు వస్తాయని టాక్ వినిపిస్తోంది.