Anchor Anasuya: జబర్దస్త్ వదిలింది అందుకే..! మళ్ళీ రావాలంటే ఆ కండీషన్.. ఎట్టకేలకు అనసూయ ఓపెన్
Anchor Anasuya: జబర్దస్త్ వదిలింది అందుకే..! మళ్ళీ రావాలంటే ఆ కండీషన్.. ఎట్టకేలకు అనసూయ ఓపెన్
Anasuya Tv Shows: ఒకరకంగా చెప్పలంటే అనసూయ నేము, ఫేము తీసుకొచ్చింది జబర్దస్త్ షో. అయితే తాజా చిట్ చాట్ లో ఈ షోతో పాటు చిన్నితెర ఎందుకు వదలాల్సి వచ్చిందనే దానిపై హింట్ ఇచ్చింది అనసూయ.
గత కొన్నేళ్లుగా జబర్దస్త్ తెరపై సందడి చేసిన అనసూయ అనూహ్యంగా ఈ షో నుంచి తప్పుకోవడం జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఒకరకంగా చెప్పలంటే అనసూయ నేము, ఫేము తీసుకొచ్చింది అదే జబర్దస్త్. అలాంటి ఈ షో ఎందుకు వదిలింది? అనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.
2/ 9
ఈ నేపథ్యంలో తాజాగా నెటిజన్లతో అనసూయ చేసిన చిట్ చాట్ లో అందుకు సమాధానం దొరికింది. తాజాగా నాతో చాట్ చేయండి అంటూ ఆన్ లైన్ లోకి వచ్చేసింది అనసూయ. దీంతో నెటిజన్లు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే మళ్లీ మీరు ఎప్పుడు బుల్లితెరపై కనిపిస్తారు? అని అడిగేశాడు ఓ నెటిజన్.
3/ 9
నిజానికి బుల్లితెరపై అనసూయ కనిపించక పోవడం ప్రేక్షకులకు ఓ వెళితే అని చెప్పుకోవాలి. ప్రతివారం జబర్దస్త్ వేదికగా తెగ హంగామా చేస్తుండేది అనసూయ. చిన్నితెరపై తనదైన కట్టు బొట్టుతో ఆకర్షించడమే గాక మాటలతో మాయ చేసేది. ఇప్పుడు అదంతా మిస్ అవుతున్నారు బుల్లితెర ఆడియన్స్.
4/ 9
ఈ నేపథ్యంలోనే బుల్లితెరపై అనసూయను చూడాలన్న తన కోరికను బయటపెడుతూ నేరుగా ఆమెనే ఈ ప్రశ్న అడిగాడు నెటిజన్. దీంతో అనసూయ చెప్పిన సమాధానం ఇప్పుడు హాట్ ఇష్యూ అయింది. ఎప్పుడైతే అమర్యాదపూర్వకమైన టీఆర్పీ స్టంట్లు కనిపించకుండా పోతాయో.. అప్పుడు నేను వస్తా అంటూ ఓపెన్ అయింది అనసూయ.
5/ 9
ఈ సమాధానం చెప్పిన అనసూయ.. నేను కూడా బుల్లితెరను బాగా మిస్ అవుతున్నా అనడం పలు చర్చలకు దారి తీసింది. టీఆర్పీ స్టంట్లు భరించలేకనే అనసూయ జబర్దస్త్ తో పాటు బుల్లితెర ప్రోగ్రామ్స్ అన్నీ వీడిందని జనాల్లో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.
6/ 9
బుల్లితెరను అలా వీడిందో లేదో సినిమాల పరంగా ఫుల్ బిజీ అయిపొయింది అనసూయ. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయంటే ఆమె ఎంత బిజీ షెడ్యూల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
7/ 9
టాలీవుడ్ తో పటు కోలీవుడ్ సినిమాల్లో కూడా అనసూయ నటిస్తోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తన కేరీర్ ఫుట్ స్టెప్ గా తీసుకుంటూ వెండితెరపై సత్తా చాటుతోంది అనసూయ. సిల్వర్ స్క్రీన్‌పై అనసూయకు మంచి డిమాండ్ దక్కడంతో ఆమెకు అవకాశాలు క్యూ కడుతున్నాయి.
8/ 9
అప్పుడెప్పుడో 18 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే స్క్రీన్‌పై కనిపించింది అనసూయ (Anasuya Bharadwaj). ఆ తర్వాత కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ గా మారి.. ఆ తర్వాత జబర్దస్త్ యాంకర్ గా అందరికీ కనెక్ట్ అయింది. ఇప్పుడు జబర్దస్త్ వీడి మళ్ళీ సిల్వర్ స్క్రీన్ జర్నీ చేస్తోంది ఈ బ్యూటీ.
9/ 9
రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలంలో రంగమ్మత్తగా చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో దాక్షాయణిగా చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప 2లో అంతకుమించిన పదునైన రోల్ చేస్తోందట అనసూయ. అంతేకాదు ఈ సినిమాలో అనసూయ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుండటం మరింత ఆసక్తికర అంశం.