ఆకాంక్ష రంజన్... ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. బాలీవుడ్ నటి ఆలియా భట్ స్నేహితురాలుగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్ మోడల్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆకాంక్ష.. మనీష్ మల్హోత్రా విక్రమ్ ఫడ్నిస్ నీతా లుల్లా వంటి ప్రముఖ డిజైనర్ల సారథ్యంలో పనిచేసింది. ఆకాంక్ష రంజన్ కపూర్ విషయానికొస్తే.. గతేడాది ఆమె నెట్ఫ్లిక్స్ 'గిల్టీ' సినిమాలో నటించింది. రుచి నరైన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, గుర్ఫతే సింగ్ పిర్జాదా, తాహెర్ షాబీర్ ప్రధాన పాత్రలు పోషించారు. (Photo Credit : Instagram)
అంతేకాకుండా ఇండియన్ క్రికెటర్ కే.ఎల్. రాహుల్ తో ఈ భామకు ఎఫైర్ ఉందని బాలీవుడ్ లో టాక్. ఈ బాలీవుడ్ భామ రీసెంట్ గా ఒక ఫోటో షూట్ కోసం హాట్ గా అందాలను ఆరబోసింది. గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతలకు అందాల బాణాలు విసురుతోందీ ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సోషల్ మీడియాను తన హాట్ ఫొటోలతో హీటెక్కిస్తోంది. (Photo Credit : Instagram)