Raviteja | గతేడాది ‘క్రాక్’ మూవీతో ఫామ్‌లోకి వచ్చిన రవితేజ.. ఇపుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈయన యాక్ట్ చేసిన ‘ఖిలాడి’ మూవీ ఈ నెల 11న విడుదల కానుంది. మరోవైపు ఈయన ‘ధమాకా’, ’రామారావు అన్ డ్యూటీ’ చేస్తున్నారు. దీంతో పాటు ఈయన తన 70వ సినిమా ‘రావణాసుర’ సినిమాను ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మతో తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. (Twitter/Photo)
మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా పోయిన యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. Photo : Twitter
క్రాక్ తర్వాత ఏకంగా రవితేజ అర డజను పైగా సినిమాలున్నాయి. ఆల్రెడీ అనౌన్స్ చేసిన ‘ఖిలాడి’ ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ఈయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధమాకా’ సినిమా కూడా కంప్లీటైంది. ఇంకవైపు శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా పూర్తైయింది. ఈ చిత్రాన్ని మార్చి 25 లేదా ఏప్రిల్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. Photo : Twitter
రవితేజ కెరీర్లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి రావణాసుర టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్ రాముడి పాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమా లాంఛ్ ఈవెంట్ జనవరి 14న సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి లాంఛింగ్ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్‌గా నటించనున్నారు. అనూ ఇమాన్యుల్, తెలుగమ్మాయి పూజిత పొన్నాడ, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, దక్ష నగర్కార్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. షూటింగ్ మొదలైన తొందరగా పూర్తి చేయాలని చూస్తున్నారు సుధీర్ వర్మ.Photo : Twitter
ఇక రవితేజ చేస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. Photo : Twitter
రావణసుర లాంఛింగ్‌లో చిరంజీవితో రవితేజ, సుశాంత్, దక్ష నగర్కర్, అనూ ఇమ్మాన్యుయేల్ పాల్గోన్నారు. మొత్తంగా రవితేజ ఖాళీ లేకండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు చిరంజీవి, బాబీ కాంబినేషన్లో వస్తోన్న సినిమాలో రవితేజ యాక్ట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం రోజుకు రూ. 25 లక్షల లెక్కన పారితోషకం తీసుకుంటున్నట్టు సమాచారం. Photo : Twitter