Ravi teja - Ravanasura Pre Release Event highlights : రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ మూవీపై అంచనాలు పెరిగేలా చేసింది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పాకళా వేదికలో శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో రవితేజతో పాటు సుశాంత్‌తో పాటు దర్శక, నిర్మాతలతో పాటు చిత్ర యూనిట్ ఉత్సాహాంగా పాల్గొన్నారు. (Twitter/Photo)
రావణాసుర సినిమాను సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ.. ఈ సినిమాలో భీమ్స్ అందించిన సంగీతం స్పెషల్ ఎక్స్పీరియన్స్. ధమాకా చిత్రానికి మంచి సంగీతం అందించారు. ఈ సినిమాకు భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ ఆకట్టుకునేలా ఉంటాయన్నారు. ఇక హర్షవర్ధన్ ఈ సినిమాకు అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. (Twitter/Photo)
ఆయా నటీమణులు తమ పాత్రలకు న్యాయం చేశారన్నారు. ఇక ఈ సినిమాకు కథ ప్రకారం ‘రావణాసుర’ అనే టైటిల్ పెట్టింది నిర్మాత అభిషేక్ నామా అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో ఆయన నిర్మాణంలో మరిన్ని చిత్రాలు చేయడానికి రెడీ అన్నారు. ఇక సుశాంత్‌తో చేసిన ప్రతి సీన్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. (Twitter/Photo)
అంతేకాదు రవితేజలో ఏమైనా చేయగలిగే సత్తా ఉంది. ఆయన్ని ఈ సినిమాలో మేకోవర్ చూసి షాక్ అవుతారు. సుశాంత్ పాత్ర కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందున్నారు. మరోవైపు సుశాంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం మొహమాటం పక్కన పెట్టయమన్నారు. ఆయన సలహాతో కెమెరా ముందు ఎలాంటి బెరకు లేకుండా నటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నటన పరంగా తనకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. (Twitter/Photo)
మొత్తంగా మంచి యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రస్తుతం రావణాసుర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా.. దక్ష నగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు.
సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం యాక్షన్ రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఐతే.. ఈ సినిమాలో సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెబుతున్నారు.ఈ సినిమాకు సెన్సార్ వాళ్ల A సర్టిఫికేట్ జారీ చేశారు. ఏప్రిల్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రంతో రవితేజ మరో సక్సెస్ అందుకుంటారా అనేది చూడాలి. (Twitter/Photo)