ముద్దంటే చేదా.. అంటే అవును చేదు అనేవాళ్ళు ఒకప్పుడు మన టాలీవుడ్ హీరోలు. బాలీవుడ్లో లిప్ లాక్ సీన్స్ కామన్ అయినా కూడా తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ ట్రెండ్ మొదలు కావడానికి చాలా రోజులు పట్టింది. మన దగ్గర ముద్దు సన్నివేశాలు అంటే కేవలం బుగ్గలు మాత్రమే.. పెదవి పెదవి కలిసి ముద్దులు తెలుగు ఇండస్ట్రీలో రావడానికి చాలా సమయం పట్టింది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా.. మన హీరోలు మాత్రం లిప్ లాక్స్ కోసం డిమాండ్ చేయలేదు.
సీనియర్ హీరోలు చాలా మంది లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. దాంతో పాటు హీరోలు కూడా మారుతున్నారు. ముద్దే కదా ఇస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు. అందుకే ఆన్ స్క్రీన్ లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోతున్నారు. స్టార్ హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరూ ఇప్పుడు ముద్దులు లాగిస్తున్నారు.
స్టార్ హీరోలు మాత్రమే కాదు చిన్న హీరోలు కూడా ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమైన డిజే టిల్లు సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ నేహా శెట్టి మధ్య అదిరిపోయే అధర చుంబనాలు ఉన్నాయి ట్రైలర్ లోనే వీటికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది కేవలం వీళ్లు మాత్రమే కాదు మిగిలిన హీరోలు కూడా కథ డిమాండ్ చేస్తే ముద్దు సన్నివేశాల్లో నటించడానికి తమకేమీ అభ్యంతరం లేదు అంటున్నారు.