ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత ఉంది. దీంతో ఏదైనా భాషలో ఏ సినిమా అన్న హిట్టైయితే.. వెంటనే ఆ సినిమాను వేరే భాషల వాళ్లు రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన రవితేజ క్రాక్.. విజయ్ డబ్బింగ్ మూవీ మాస్టర్ మూవీలు మంచి టాక్‌తో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ దాటి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలై హిట్టైన ఈ చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేయాలనే ఆలోచనలో బాలీవుడ్ మూవీ మేకర్స్ ఉన్నట్టు సమాచారం. (Twitter/Photo)
రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే లాభాల్లోకి ప్రవేశించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కలు కోసం పలువురు బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీపడుతున్నారు. (Ravi Teja Krack)
క్రాక్, మాస్టర్ మూవీలే కాకుండా... సూర్య హీరోగా నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ ఓటీటీ వేదికగా విడుదలై సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి. గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాగా రికార్డు నెలకొల్పింది. (Twitter./Photo)
‘ఆకాశం నీ హద్దురా’ సినిమా హిందీ రీమేక్‌లో షాహిద్ కపూర్ హీరోగా నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే షాహిద్ అర్జున్ రెడ్డి సినిమాను ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమాను అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేస్తున్నాడు. తాజాగా ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. (Twitter/Photo)
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఫ్లాపుల్లో వీళ్లిద్దరు ఈ సినిమాతో తిరిగి స్టార్ డమ్ అందుకున్నారు.నిధి అగర్వాల్, నభా నటేష్ అందాలతో పాటు మణిశర్మ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసి వావ్ అనిపించాడు. ముఖ్యంగా మాస్ బీట్ సాంగ్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసాడు. (Twitter/Photo)
ఇస్మార్ట్ శంకర్ లాంటి ఊర మాస్ ఓరియంటెడ్ మూవీకి రణ్వీర్ సింగ్‌కు మించిన ఆప్షన్ లేదు. ఇప్పటికే ‘సింబా’, ‘గల్లీ బాయ్’ వంటి చిత్రాల్లో మాస్ హీరోగా తనకంటూ స్పెషల్ క్రేజ్ ఏర్పరుచుకున్నాడు రణ్వీర్ సింగ్. హిందీ ‘ఇస్మార్ట్ శంకర్’ రీమేక్‌ను పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. లేకపోతే వేరే ఎవరైనా డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. (Twitter/Photo)
2019లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అదే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌తో మంచి హిట్ అందుకున్న షాహిద్ కపూర్ ఇపుడు ‘జెర్సీ’ తో మరో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రంలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. (Twitter/Photo)
నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం అయింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ అన్ని భాషల్లో వర్కౌట్ అయ్యేలా ఉండటంతో ఈ చిత్రాన్ని హిందీతో పాటు పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్ర హిందీ రీమేక్‌లో కూడా నవీన్ పొోలీశెట్టి నటించే అవకాశం ఉంది. (Twitter/Photo)
శ్రీ విష్ణు, సత్యదేవ్, నివేదా థామస్, నివేదా పేతురాజ్ నటించిన ‘బ్రోచేవారెవరురా’ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. తెలుగు వెర్షన్ డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా రీమేక్‌లో సన్ని దేవోల్ కుమారుడు కరణ్ దేవోల్, అభయ్ డియోల్ హీరోగా అజయ్ దేవ్‌గణ్ తెరకెక్కిస్తున్నాడు. Twitter/Photo)