Dimple Hayathi: వరస సినిమాలు చేయాలని.. బ్రేకుల్లేకుండా కెరీర్ ముందుకు తీసుకెళ్లాలని ఎన్ని కలలు కంటున్నా కూడా.. మధ్యలో కరోనా వాటికి బ్రేకులు వేస్తుంది. ఇప్పుడు డింపుల్ హయతి విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈమెకు కూడా కరోనా రావడంతో కెరీర్‌కు కొన్ని రోజులు బ్రేకులు తప్పడం లేదు. వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh) సినిమాలో ఐటం సాంగ్ 'జర్ర జర్ర' అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపిన భామ డింపుల్ హయాతీ(Dimple Hayathi). ఆ పాటలో తన అందచందాలతో పాటు అదిరిపోయే డ్యాన్స్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈ భామకు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అది అలా ఉంటే ఎప్పటికప్పుడు తన హాట్ పిక్స్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది డింపుల్. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో డింపుల్ కూడా ఉందిప్పుడు. ఈమెకు మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్ని ఇండస్ట్రీల నుంచి డింపుల్ అవకాశాలు అందుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. (Dimple Hayati/instagram)
హీరోయిన్ అందంగా కనిపించాలంటే ముందు మెయింటేన్ చేయాల్సింది ఫిజిక్. ఇప్పుడు డింపుల్ హయతీ కూడా ఇదే చేస్తుంది. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ.. అద్భుతమైన ఫిజిక్ తో అందర్నీ మాయ చేస్తుంది డింపుల్. ముఖ్యంగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. (Dimple Hayati/instagram)
ఇప్పటికప్పుడు అవకాశాలు రావాలన్నా.. ఇండస్ట్రీలోనే ఉండాలన్నా డింపుల్ హయతీకి హాట్ ఫోటోషూట్స్‌కు మించిన మార్గం మరోటి లేదు. ముందు నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే.. హీరోయిన్గా అందాలు ఆరబోయాలి. ఆ తర్వాత మంచి సినిమాలు పడితే వద్దన్నా అవకాశాలు వస్తుంటాయి. దీనికోసమే డింపుల్ ప్రయత్నం. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అన్ని ఇండస్ట్రీలపై దండయాత్రకు సిద్ధమవుతుంది డింపుల్ హయతీ. (Dimple Hayati/instagram)