ప్రస్తుతం రవితేజ,డింపుల్ హయతిలపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఇందులో మీనాక్షి చౌదురి మరో హీరోయిన్ నటిస్తోంది. అనసూయ మరో కీలక పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్లో నటించాడా ? ఒకడే ఇద్దరిగా నటిస్తున్నాడా అనేది ఆసక్తికరంగా ఉంది. . రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. (Twitter/Photo)
ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొన్నటి వరకు ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది.