మాస్ మహారాజ రవితేజ హీరోగా వస్తోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ధమాకా.. త్రినాథరావు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెళ్లి సందD భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ మూవీని పక్కా ఎంటర్టైనర్ గా త్రినాధరావు నక్కిన తెరకెక్కిస్తున్నారు. Photo : Twitter
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్‌లో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ‘డు డు’ సినిమా లిరికల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్య కాలంలో బడా హీరోల సినిమాలకు థియేట్రికల్ బిజినెస్ కంటే నాన్ థియేట్రికల్ బిజినెస్‌తోనే మంచి లాభాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజ ‘ధమాకా’ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరిగినట్టు సమాచారం. (Twitter/Photo)
రవితేజ ‘ధమాకా’ చిత్రానికి నాన్ థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ. 30 కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 10 కోట్లుకు పలికాయట. మరోవైపు శాటిలైట్,డిజిటల్ హక్కులు రూ. 20 కోట్లు పలికాయట. క్రాక్ తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు ఫ్లాప్ అయిన ఈ మూవీకి ఈ రేటు పలకడం మాములు విషయం కాదు. (Twitter/Photo)
ఇక రవితేజ లేటెస్ట్గా నటించిన రామారావు సినిమా విషయానికి వస్తే.. రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది కథ. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు సోనీలివ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంక్ష కౌశిక్‌తో పాటు రజీష విజయన్ హీరోయిన్గా నటించారు. రామారావు ఆన్ డ్యూటీ (Raviteja Ramarao On Duty) నటుడిగా రవితేజకు 68వ సినిమా. (Twitter/Photo)
ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు.