Home » photogallery » movies »

RAVI TEJA AS TIGER NAGESWARA RAO NUPUR SANON HEROINE TO PAIR WITH MASS MAHARAJ TA

Ravi Teja As Tiger Nageswara Rao : ‘టైగర్ నాగేశ్వరరావు’లో రవితేజకు జోడిగా నూపుర్ సనన్.. అధికారిక ప్రకటన..

Ravi Teja As Tiger Nageswara Rao | మాస్ మహారాజ్ రవితేజ గతేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత ఖిలాడి మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి సినిమాతో పాటు స్టూవర్డుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్రపై అదే టైటిల్‌తో ఓ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో చేస్తున్నారు. అంతేకాదు దానికి సంబంధించిన లుక్‌ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.