రవితేజ హీరోగా అంగీకరించిన చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. ఈ సినిమాను ఉగాది కానుకగా ఈ శనివారం లాంభనంగా ప్రారంభం కానుంది.అంతేకాదు ఈ చిత్రంలో నుపుర్ సనన్ ఒక కథానాయికగా నటిస్తున్నట్టు చెప్పారు. మరో హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ నటిస్తోంది. అంతేకాదు ఈ సినిమా ప్రీ లుక్‌ను 12.06 నిమిషాలకు విడుదల చేయనున్నారు. (Twitter/Photo)
మొత్తంగా రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో ఒకేసారి నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. మొత్తంగా ప్రీ లుక్స్‌తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. స్టూవర్డుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్రపై అదే టైటిల్‌తో రవితేజ ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.(Twitter/Photo)
Ravi Teja As Tiger Nageswara Rao | మాస్ మహారాజ్ రవితేజ గతేడాది ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. ఈ సినిమా తర్వాత ఖిలాడి మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా వంటి సినిమాతో పాటు స్టూవర్డుపురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్రపై అదే టైటిల్‌తో ఓ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో చేస్తున్నారు. అంతేకాదు దానికి సంబంధించిన లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. (Twitter/Photo)
‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని బ్రిటిష్ పట్టుకొని ఉరి తీశారు. అలాంటి పాత్ర సరసన నుపుర సనన్ అంటే యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రే అనే చెప్పాలి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్.. ఆమెకు స్వాగతం పలుకుతూ.. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. (Twitter/Photo)