Raveena Tandon: ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత మంది చెప్పినా కూడా అలాంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తమకు ఎదురైన చేదు సంఘటనల..
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఎంత మంది చెప్పినా కూడా అలాంటి సంఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి మీడియా ముందు చెప్తూనే ఉన్నారు హీరోయిన్లు.
2/ 8
మరీ ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత నెపోటిజమ్ కూడా దీనికి తోడైంది. ఓ వైపు బంధుప్రీతి.. మరోవైపు కాస్టింగ్ కౌచ్‌తో టాలెంటెడ్ నటులు ఆఫర్స్ లేకుండా పోతున్నారని చాలా మంది విమర్శిస్తూనే ఉన్నారు.
3/ 8
ఈ క్రమంలోనే ఇప్పుడు రవీనా టాండన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో నెపోటిజమ్ పీక్స్‌లో ఉంటుందని ఈమె చెప్పుకొచ్చింది.
4/ 8
తమ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లకే అవకాశాలు ఇవ్వాలని.. తమకు కావాల్సిన వాళ్లనే పైకి తీసుకురావాలని ఇక్కడ చాలా మంది ఆలోచిస్తుంటారని చెప్పుకొచ్చింది. తమ మాట వినని వాళ్ల కెరీర్‌ను అధ:పాతాళానికి తొక్కేస్తుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
5/ 8
వాళ్లకు పొగరు ఎక్కువ.. బ్యాడ్ బిహేవియర్ అంటూ లేనిపోని దుష్ప్రచారం చేస్తుంటారని చెప్పింది రవీనా. తన విషయంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేసుకుంది ఈమె. కెరీర్ కొత్తలో తనపై కూడా బాలీవుడ్లో చాలా కుట్రలు జరిగాయని చెప్పుకొచ్చింది.
6/ 8
అప్పుడు తను వరస సినిమాలు చేస్తున్న సమయంలో కొందరు పని గట్టుకుని తన ఇమేజ్ పాడు చేసారని.. తమకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులతో తనపై చెడు ఆర్టికల్స్ రాయించారని చెప్పింది రవీనా.
7/ 8
ఇదంతా వాళ్ల బెడ్రూమ్కు తాను వెళ్లలేదనే కక్ష్య అని.. వాళ్ల కామ వాంఛ తీర్చలేదనే కసి అని నగ్నసత్యాలు చెప్పింది రవీనా టాండన్. అలాంటి వాళ్లు బాలీవుడ్లో చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చింది ఈమె.
8/ 8
కేవలం పడక సుఖం కోసమే హీరోయిన్ల కెరీర్స్ నాశనం చేసే బ్యాచ్ ఒకటి ఎప్పుడూ బాలీవుడ్లో ఉంటుందని ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.