కేజీఎఫ్ 2లో ప్రధాన మంత్రి రమికా సేన్ పాత్రలో నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను తన నటనతో అట్రాక్ట్ చేసింది ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓ రేంజ్లో టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. మొత్తంగా ఈ సినిమా రూ. 546 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం రేపుతోంది. (Twitter/Photo)
‘దిల్ వాలే’, ‘మొహ్రా’ ఈ రెండు చిత్రాలు యాక్షన్‌తో పాటు ఈ సినిమాలోని పాటలు అప్పుడు ట్రెండ్ సెట్ చేసాయి. ముఖ్యంగా ‘మొహ్రా’లో తూ ఛీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ బాలీవుడ్ సాంగ్స్‌లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ పాటలో రవీనా టాండన్ అందాలకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. (Instagram/Photo)
తెలుగులో అక్కినేని నాగేశ్వరావు, వినోద్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన ‘రథసారధి’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వా త హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంగారు బుల్లోడు’ సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో స్వాతిలో ముత్యమంత పాటలో తన తడి అందాలతో ఇక్కడి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. (Twitter/Photo)