ఇక అది అలా ఉంటే ఈ అమ్మడు అటు సోషల్ మీడియాలో యమ యాక్టివ్.. అక్కడ తాను నటిస్తున్న సినిమాలతో పాటు తన అంద చందాలతో కనుల విందు చేస్తూ మరింత పాపులర్ అవుతోంది. దక్ష ప్రస్తుతం రవితేజ రావణాసురలో నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. Photo : Instagram
మాస్ మహారాజా రవితేజ (Raviteja ) గతేడాది చివర్లో ‘ధమాకా’ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ అందుకుని 2022కు మంచి ముగింపు పలికాడు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. పెళ్లి సందD భామ శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. Photo : Instagram
భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 2022 డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా చిరంజీవితో కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించింది.. Photo : Instagram
ఇక దక్ష నటిస్తున్న రావణాసుర విషయానికి వస్తే.. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సుశాంత్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో రవితేజ లాయర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. Photo : Instagram
రావణాసుర (Ravanasura ) నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ రైట్స్ దాదాపుగా రూ. 12 కోట్లకు పైగానే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా ఈసినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నారు... Photo : Instagram
రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. .. Photo : Instagram
రవితేజ ధమాకా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న థియేటర్స్‌లో విడుదలై రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది ధమాకా. విలక్షణ కథకు ఈ సినిమాలోని పాటలు తోడు కావడంతో బ్లాక్ బస్టర్ మూవీగా పలు రికార్డులు క్రియేట్ చేసింది ధమాకా. ముఖ్యంగా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో బాణీలు తెలుగు ప్రేక్షకుల్లో ఊపు తెప్పించాయి.. Photo : Instagram
ఇక దక్ష నగార్కర్ పర్సనల్ విషయానికి వస్తే... 'హుషారు'తో తెలుగులో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన 'జాంబీరెడ్డి' ద్వారా చక్కటి పెర్ఫార్మెన్స్ అందించింది. అయితే అందంలో ఏవరికి ఏమాత్రం తీసిపోని దక్షకు ఆఫర్స్ మాత్రం సరైనా అవకాశాలు రావాట్లేదు. అయితే ప్రస్తుతం తెలుగులో ఓసినిమాలో నటిస్తోంది. చూడాలి మరి అమ్మడికి ఇప్పటికైనా కలిసివస్తుందో లేదో.. Photo : Instagram
అందాలను విందుల వడ్డించడంలో దక్షా నగార్కర్ తర్వాతే మరెవరైనా అని అంటున్నారు నెటిజన్స్. అందుకే ఈ అమ్మడు పెద్దగా సినిమాలు లేకపోయినా తన ఫోటోషూట్లతో రెచ్చిపోతోంది. ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. Photo : Instagram