Rashmika Mandanna: చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్.. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ట్రోల్స్ కు గురవుతుంది. తన ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్త వహించే రష్మిక హడావిడిలో మాస్క్ మరచిపోయింది. అయితే అందుకు సంబంధించిన వీడియోలో రష్మిక ఓవర్ చేసిందని బి టౌన్ లో కామెంట్లు వైరల్ అవుతున్నాయ్. ఒక ప్రాంతానికి వెళ్లిన అక్కడ కారు దిగి అలా నడుచుకుంటూ వచ్చింది.. కొన్ని సెకండ్లకు రష్మికకు తాను మాస్క్ ధరించలేదని గుర్తించింది.. దీంతో మూతికి చేతిని అడ్డు పెట్టుకుని పరిగెత్తుకెళ్లి కారులో మాస్క్ ను తీసి ధరించింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.