Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. Photo : Instagram
రష్మిక మందన ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ (Allu Arjun Sukumar) కాంబినేషన్లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావోచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ నెలలో విడుదలకానుంది. Photo : Instagram
కాగా ఈ సినిమా నుంచి రష్మిక మందన్న లుక్ విడుదలైంది. పుష్పలో రష్మిక లుక్ చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తి కరంగగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో చీరకట్టులో ఉన్న లుక్‌ను విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఆమె లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమాకు చెందిన మొదటి భాగం షూటింగ్ ఇటీవల ఏపీలోని మారేడు మిల్లి అడువుల్లో జరిగింది. అక్కడే పదిహేను రోజుల పాటు షూటింగ్ జరుపుకుంది పుష్ప టీమ్. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుపుకుంటోంది. Photo : Instagram
ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ (Fahadh Faasil ) ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటిస్తోంది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల దాక్కో దాక్కో మేక (Pushpa Daakko Daakko Meka song) అనే ఊర మాస్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించింది. Photo : Instagram
ఈ పాట తెలుగుతో పాటు హిందీ తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. Photo : Instagram