రష్మిక అల్లు అర్జున్‘పుష్ప’తర్వాత ఇతర భాషల్లోనూ బిజీగా మారారు. అందులో భాగంగా ఆమె తెలుగుతో పాటు హిందీలో వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పటికే రష్మిక ప్రస్తుతం తమిళ హీరో విజయ్‌కి జంటగా ‘వారసుడు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Instagram
ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. రష్మిక గుడ్‌బైతో పాటు హిందీలో మిషన్ మజ్ను అనే స్పై థ్రిల్లర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హిందీ యువ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. అయితే తెలుస్తోన్న సమాచారం మేరకు మిషన్ మజ్ను డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది Rashmika Mandanna Instagram
సూపర్ స్టార్ మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో మూడో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కృష్ణ గారి మరణంతో షూటింగ్ కాస్త లేటయ్యేలా ఉంది. ఈ లోపు మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐటెం సాంగ్ కోసం రష్మికను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ సినిమాల్లో ఇప్పటివరకు స్పెషల సాంగ్ అనేది లేదు.
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram