అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమా పెద్ద హిట్ కావడంతో.. ఇప్పుడు దాని సీక్వెల్ తీసే పనిలో పడ్డాడు డైరెక్టర్ సుకుమార్. పుష్ప 2 మూవీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ పార్ట్ 1 సినిమా తెలుగులోనే కాదు.. రిలీజైన అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది.
బన్నీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ రిలీజ్ పై లేటెస్ట్ గా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పుష్ప 2 సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించి గత కొన్ని నెలలుగా ఆసక్తికర వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. @Allu Arjun (Photo Twitter)
‘పుష్ప 2’ లో తారాగణం పై కూడా అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఆసక్తికర వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్న అని అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి ఔట్ అయినట్లు సమాచారం. అయితే రష్మికకు సంబంధించిన వార్తలు ఎలా ఉన్నా.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
మొత్తానికి పుష్ప2 త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో దర్శకుడు సుకుమార్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఫైనల్ వెర్షన్ ను రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుతున్నారు. బన్నీ కూడా ఈ మధ్యలోనే ఓ ఈవెంట్లో మాట్లాడుతూ... పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నానని చెబుతున్నాడు, మరి ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని అంతా ఎదురు చేస్తున్నారు. .