రష్మిక ఇటీవల తెలుగులో సీతా రామంతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆమె నటించిన మరో సినిమా గుడ్ బై ఇటీవల విడుదలై ఓకే అనిపించుకుంది. ఇక అది అలా ఉంటే రష్మిక ఓ తమిళ భారీ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న చియాన్ విక్రమ్ తాజాగా తన 61వ చిత్రానికి రెడీ అవుతున్నారు.. Photo : Twitter
.ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను స్టూడియోస్ గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్గా నటి రష్మిక మందన్నా నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రంలో ఆమె నటించడం లేదని తెలుస్తోంది. రష్మిక వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె స్థానంలో మాళవిక మోహనన్‌ను తీసుకుంటున్నారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
తెలుగుతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటిస్తూ అదరగొడుతున్నారు రష్మిక. అయితే ఓ వైపు నటిస్తూనే రాజకీయాల్లోకి కూడా వస్తారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మిక కర్నాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీచేయనున్నారట. ప్రముఖ తెలుగు జ్యోతిష్యుడు వేణు స్వామి రష్మిక గురించి చేసిన కామంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. రష్మిక త్వరలోనే రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. Photo : Twitter .
అంతేకాదు ఏకంగా కర్నాటన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి లోక్ సభ ఎంపీ అవుతారని ఆయన అంటున్నారు. వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సెలబ్రిటీల జాతకం చూసి వాళ్ళ జీవితాల్లో జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించి చెబుతారు. గతంలో సమంత విడాకులపై, నయనతార పెళ్లిపై కూడా కొన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రష్మిక పొలిటికల్ ఎంట్రీ పై వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఇక ఈ కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. రష్మిక అల్లు అర్జున్‘పుష్ప’తర్వాత ఇతర భాషల్లోనూ బిజీగా మారింది. అందులో భాగంగా ఆమె తెలుగుతో పాటు హిందీలో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే రష్మిక ప్రస్తుతం తమిళ హీరో విజయ్‌కి జంటగా ‘వారసుడు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. Photo : Instagram
అంతేకాదు రష్మిక హిందీ సినిమాల్లో కూడా బిజీ అవుతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో మిషన్ మజ్ను, యానిమల్ సినిమాలు ఉన్నాయి. ఇక రష్మిక తెలుగులో పుష్ప 2లో నటిస్తుంది. వీటితో పాటు రష్మిక ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాలోను అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. వీటితో పాటు మరికొన్ని హిందీ సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ రేంజ్లో ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో ఏ భామకు ఇంత మంచి ప్యాన్ ఇండియా లైనప్ లేదు. దీంతో తోటి హీరోయిన్స్ తెగ కుళ్లు కుంటున్నారట. రష్మిక తన లైఫ్‌లో ప్రస్తుతం పీక్‌లో ఉన్నారని.. ఈరేంజ్‌లో సినిమాలు ఏ తెలుగు హీరోయిన్‌కు లేవని.. అంటున్నారు సినీ విశ్లేషకులు. Photo : Instagram
రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Instagram
కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. ఇటు తెలుగు చిత్రాల్లో నటిస్తూనే 2021 లో విడుదలైన సుల్తాన్ అనే సినిమాతో తమిళ చిత్రాల్లోకి ప్రవేశించింది. అంతేకాదు మిషన్ మజ్ను సినిమా ద్వారా రష్మిక హిందీ చిత్రాల్లో కూడా అడుగుపెట్టింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా చేస్తున్నారు. Photo : Twitter
పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించారు రష్మిక మందన్న. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా చేశారు. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా 2021 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Photo : Twitter
ఇక రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు.. శర్వానంద్ హీరోగా చేశారు. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand )ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నాడు. హిట్టు ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు శర్వానంద్. అయితే కొన్నేళ్లుగా శర్వానంద్‌కు (Sharwanand) సరైన విజయం లేదు. ఎంచుకున్న సినిమాల కథలు బాగున్నా విజయాలు అందుకోలేకపోతున్నారు. Photo : Twitter
ఇక ఆ తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన లేటెస్ట్ సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మార్చ్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఓకే అనిపించుకుంది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో శర్వానంద్‌కు జోడిగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించారు. Photo : Twitter
ప్రస్తుతం రష్మిక చేతిలో బోలెడన్ని ఆఫర్స్ అవి కూడా ప్యాన్ ఇండియా లెవల్లో వివిధ భాషల నుంచి ఈ అమ్మడికి వస్తున్నాయి. మరోవైపు ఈమె ఎక్కడ కనపడ్డ మీడియా కూడా రష్మికను పలు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో బోలెడు ఆఫర్స్ ఉన్నాయి. వచ్చిన వాటిలో ఆచితూచి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. (Instagram/Photo)Photo : Twitter