Rashmika Mandanna | సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన పాత్రను వేరే హీరోల దగ్గరకు వెళ్తు ఉంటాయి. అలాగే ఒక హీరోయిన్ చేయాల్సిన పాత్రను మరో కథానాయిక చేయడం సినీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఒక్కోసారి ఆయా పాత్రలు మిస్ చేసుకున్న పాత్రలు వేరే వాళ్లుకు మంచి సక్సెస్ అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి ఆయా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్న రష్మిక మందన్న తన కెరీర్లో కొన్ని సూపర్ హిట్స్ సినిమాలు ఒదులుకున్న సందర్భాలున్నాయి.
ఇక ఏప్రిల్ 29న విడుదలైన చిరంజీవి, రామ్ చరణ్ల్ ‘ఆచార్య’లో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నను అడిగారు. ఆమెకు డేట్స్‌తో అడ్జస్ట్ చేయలేకనో మరో కారణంగా ఈ సినిమా ఒదులుకొంది. ఇక ఆచార్య సినిమాలో పూజా హెగ్గే పాత్ర ఉన్నా పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమె కేవలం మెగా హీరోల సినిమా అనే కారణంతో పాటు రెమ్యునరేషన్ ఎక్కువగా ఇవ్వడంతో ఈ సినిమాకు సైన్ చేసినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆచార్యలో పూజా హెగ్డే పాత్ర కూరలో కరివేపాకు మాదిరిగా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఓ రకంగా రష్మిక ఆచార్య సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసి మంచి పని చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమె రిజెక్ట్ చేసిన ఇతర చిత్రాల విషయానికొస్తే.. (Twitter/Photo)
రష్మిక మందన్న విషయానికొస్తే.. తెలుగులో ‘ఛలో’ మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన ‘గీతా గోవిందం’ తో ఏకంగా స్టార్ హీరోయిన్గా అయింది. ఆ తర్వాత మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరుతో పాటు అల్లు అర్జున్ తో చేసిన పుష్పతో ఏకంగా ప్యాన్ ఇండియా హీరోయిన్ అయింది. అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదగడంలో రష్మిక ఎంపిక చేసుకున్న స్టోరీలు కూడా కీ రోల్ పోషించాయి. ఈ ఐదేళ్ల కాలంలో ఈమె 50 పైగా స్క్రిప్ట్స్‌ను రిజెక్ట్ చేసింది. అందులో ఆచార్యతో పాటు 10 పైగా సూపర్ హిట్ సినిమాలున్నాయి. (Rashmika Mandanna Twitter)
జెర్సీ (హిందీ) : తెలుగులో హిట్టైన జెర్సీ మూవీని హిందీలో అదే టైటిల్‌తో షాహిద్ కపూర్‌తో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ముందుగా కథానాయికగా రష్మిక మందన్నను సంప్రదించారు. కానీ ఇందులో ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో రష్మిక ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం మృణాల్ సేన్‌ను తీసుకున్నారు. (Twitter/Photo)
ఆచార్య | చిరంజీవి, రామ్ చరణ్ల్ ‘ఆచార్య’లో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్నను అడిగారు. ఆమెకు డేట్స్‌తో అడ్జస్ట్ చేయలేకనో మరో కారణంగా ఈ సినిమా ఒదులుకొంది. ఏప్రిల్ 27 విడుదలైన ఆచార్య సినిమాలో పూజా హెగ్గే పాత్ర ఉన్నా పెద్దగా ప్రాధాన్యం లేదు. ఆమె కేవలం మెగా హీరోల సినిమా అనే కారణంతో పాటు పారితోషకం కారణంగా ఈ సినిమాకు సైన్ చేసినట్టు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆచార్యలో పూజా హెగ్డే పాత్ర కూరలో కరివేపాకు మాదిరిగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓ రకంగా రష్మిక ఆచార్య సినిమాలో పాత్రను రిజెక్ట్ చేసి మంచి పని చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. (Twitter/Photo)
మాస్టర్ | తమిళ హీరో విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ ‘మాస్టర్’. ఈ మూవీలో ముందుగా కథానాయిక పాత్ర రష్మిక దగ్గరకు వచ్చింది. తన పాత్ర చాలా తక్కువగా ఉండటంతో ఈ మూవీ చేయడానికి ఓకే చెప్పలేదు. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా మాళవిక మోహనన్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం విజయ్, వంశీ పైడిపల్లి చిత్రంలో ఈమె కథానాయికగా నటిస్తోంది. (Twitter/Photo)
RC 15 | రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న మూవీలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మికను సంప్రదించారు. కానీ ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కియారా అద్వానీని తీసుకున్నారు. ప్రస్తుతం రష్మిక జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యూవీ క్రియేషన్స్‌లో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆ సారైనా వీరిద్దరు జోడి కడతారా అనేది చూడాలి. (Twitter/Photo)