ఎప్పుడైనా మనకు కావాల్సిందే వింటున్నట్టు భావిస్తాం. అలాగే ఆ వీడియోలో విజయ్ వాయిస్ విన్నట్టుగా అంతా అభిప్రాయపడ్డారు. కానీ ఆ సమయంలో మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుతున్నారంతే. విజయ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే. ప్రస్తుతం విజయ్ తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. నేను కూడా అప్ కమింగ్ ఫిల్మ్స్ కోసం ఎదురుచూస్తున్నాను అని చెప్పింది రష్మిక.
విజయ్, నేను సెలబ్రెటీలం కావడంతో ఇలాంటి రూమర్లు రావడం సాధారణం. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అనవసరమైన రూమర్లు వచ్చినప్పుడు బాధగా ఉంటుంది. విజయ్ ఇంట్లో గానీ, మా ఫ్యామిలీలో గానీ ఈ విషయం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ విషయాలు వదిలేసి సినిమాల గురించి మాట్లాడితే అందరికీ మంచింది అని రష్మిక చెప్పింది.