Rashmika Mandanna: రష్మిక ఘాటు పోజులు.. మ్యాగజైన్ కోసం అందాల విందు
Rashmika Mandanna: రష్మిక ఘాటు పోజులు.. మ్యాగజైన్ కోసం అందాల విందు
Rashmika Mandanna Hot Stills: తాజాగా ఓ మ్యాగజైన్ కోసం హాట్ ఫోజులిచ్చింది రష్మిక మందన్న. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో వైరల్ గా మారాయి. చురకత్తుల్లాంటి రష్మిక లుక్స్ తో పాటు ఘాటు పోజులు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్న ట్రెండ్ నడుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె హాట్ గేర్ వేయడమే. ఎప్పటిప్పుడు తన అందాలతో అట్రాక్ట్ చేస్తూ రచ్చ చేస్తోంది రష్మిక. దీంతో అమ్మడి పిక్స్ వైరల్ అవుతున్నాయి.
2/ 9
తాజాగా ఓ మ్యాగజైన్ కోసం హాట్ ఫోజులిచ్చింది రష్మిక మందన్న. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకోవడంతో వైరల్ గా మారాయి. చురకత్తుల్లాంటి రష్మిక లుక్స్ తో పాటు ఘాటు పోజులు చూసి పిచ్చెక్కిపోతున్నారు నెటిజన్లు.
3/ 9
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ అందాల ఆరబోత మరీ శృతిమించి పోతోంది. సోషల్ మీడియా వేదికగా అందాల భామలు రెచ్చిపోతున్న తీరు షాకిస్తోంది. ఈ జాబితాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరిపోయింది.
4/ 9
ఛలో అంటూ తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి యూత్ ఆడియన్స్ మనసు దోచుకున్న రష్మిక.. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు చేసి స్టార్ స్టేటస్ పట్టేసింది.
5/ 9
రష్మిక టాలెంట్, పాపులారిటీ చూసి బాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వరుస ఆఫర్స్ తలుపుతడుతున్నాయి. దీంతో ప్రస్తుతం యమ బిజీ అయింది ఈ హీరోయిన్. ఇంత బిజీలో కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ నెట్టింట హంగామా చేస్తోంది.
6/ 9
ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్లినా మీడియా కెమెరాలన్నీ తనవైపే తిరిగేలా మోడ్రన్ డ్రెస్సులేస్తోంది రష్మిక. తన గ్లామరస్ అందాలతో మైమరిపిస్తోంది. దీంతో రష్మిక కనిపిస్తే చాలు కెమెరా క్లిక్స్ మోత మోగుతున్నాయి. రష్మికను డిఫరెంట్ కోణాల్లో బంధించేందుకు కెమెరామెన్లు పోటీ పడే పరిస్థితి నెలకొంది.
7/ 9
ప్రస్తుతం రష్మిక మూడు బడా సినిమాల్లో భాగం అవుతోంది. అల్లు అర్జున్ హీరోగా రానున్న పుష్ప 2 సినిమాలో పాటు విజయ్ వారసుడు సినిమాల్లో నటిస్తున్న ఆమె.. రణ్‌బీర్ కపూర్ యానిమల్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.
8/ 9
పుష్ప సినిమాలో శ్రీవల్లిగా రష్మిక నటనకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. అయితే దీనికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప 2లో రష్మిక లుక్ మరింత అట్రాక్ట్ చేసేలా ప్లాన్ చేశారట డైరెక్టర్ సుకుమార్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీ అయింది రష్మిక మందన్న.
9/ 9
అదేవిధంగా మహేష్ బాబు కొత్త సినిమాలో రష్మిక మందన్న ఐటెం సాంగ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమాలో హుషారెత్తించే స్పెషల్ సాంగ్ లో మహేష్‌తో రష్మిక కాలు కడపనుందని సమాచారం.