విజయ్ దేవరకొండతో చేసిన గీతగోవిందం, మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో చేసిన భీష్మ సినిమాలు ఆమె కెరీర్‌కి పూల బాటలు వేశాయి. ఆ తర్వాత జెట్ స్పీడులో దూసుకుపోతోంది రష్మిక మందన. టాప్ డైరెక్టర్లు సైతం తన డేట్స్ కోసం పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ కన్నడ సోయగం.