Rashmika Mandanna: గుర్తుపట్టలేనంతగా మారిన రష్మిక మందన్న.. సర్జరీ చేయించుకుందా ?
Rashmika Mandanna: గుర్తుపట్టలేనంతగా మారిన రష్మిక మందన్న.. సర్జరీ చేయించుకుందా ?
టాలీవుడ్లో ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. ఈ భామ అల్లు అర్జున్‌తో చేసిన పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారింది. అటు బాలీవుడ్లో కూడా ఈ భామకు వరుసగా అవకాశాలు అందుతున్నాయి. అయితే తాజాగా రష్మిక లుక్ చేసిన అభిమానులు షాక్ అవుతున్నారు. ఆమె సర్జరీ చేయించుకుందా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిన స్టార్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. పుష్ప సినిమాతో రష్మికకు ఎక్కడలేని క్రేజ్ ఏర్పడింది. దీంతో ఈ భామకు వరుసగా అవకాశాలు కూడా క్యూ కడుతున్నాయి.
2/ 7
తాజాగా రష్మిక ఇటీవల బాలీవుడ్ హంగామా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొంది. దక్షిణాదికి చెందిన హీరోయిన్.. ప్రతిభావంతులైన నటి బాలీవుడ్ తారలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
3/ 7
అయితే ఇక్కడ రష్మిక లుక్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తిగా డిఫరెంట్ గా కనిపించే రష్మికను చూసి అంతా షాక్ అయ్యారు. ఇక నెటిజన్లు కూడా ఆమె డిఫరెంట్ లుక్‌పై జోరుగా చర్చించుకుంటున్నారు.
4/ 7
ఎప్పటిలాగే.. రష్మిక మందన్న ఫుల్ స్మైల్‌తో కెమెరాకు ఫోజులిచ్చింది. అయితే నటి లుక్‌లో మార్పు వచ్చిందని.. ఆ నటికి ఏదో సర్జరీ చేయించుకున్నారని టాక్ నడుస్తోంది. బాలీవుడ్లో నటీమణులు సర్జరీ చేయించుకోవడం సర్వసాధారణం.
5/ 7
తాజాగా హల్ చల్ చేస్తున్న ఫోటోల్లో రష్మిక బ్లాక్ అండ్ గౌనులో కనిపించింది., స్ట్రెయిట్ హెయిర్‌తో సింపుల్ హెయిర్ స్టైల్ చేసుకుంది. కానీ రష్మిక చిరునవ్వులో, పెదవులు చాలా భిన్నంగా కనిపించాయి.
6/ 7
రష్మిక కొత్త లుక్‌ను చూసిన అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు రష్మిక మందన్న లావుగా ఉందని అంటున్నారు. అయితే రష్మిక ఇంత డిఫరెంట్‌గా కనిపించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇది మేకప్ ప్రభావం కావచ్చునని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
7/ 7
రష్మిక మందన్న లేటెస్ట్ లుక్కు సంబంధించిన ఫోటోలు... అన్ని చోట్ల వైరల్‌గా మారాయి.. ప్రస్తుతం ఈ భామ పుష్ప 2తో అల్లు అర్జున్‌తో బిజీగా ఉంది. దీంతో పాటు నితిన్‌తో మరో తెలుగు సినిమా కూడా చేయనుంది.