Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆకట్టకుంటోంది. Photo Credit:Instagram
Rashmika Mandanna : రష్మిక మందన్న కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరాజ్‌పేట్‌లో ఏప్రిల్ 5, 1996లో జన్మించారు. రష్మిక కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత రష్మిక M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. రష్మిక మందన్న బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఫర్ 2014 జాబితాలో చోటు సంపాదించి అదరగొట్టారు. Photo : Twitter
కన్నడలో ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో యువ నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు సినిమా. ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో పాటు మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటీ స్టార్స్‌తో సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది ఈ కూర్గ్ అందం. Photo : Rashmika Instagram