రష్మిక మొదటి సినిమా... కిరాక్ పార్టీ, రక్షిత్ శెట్టి హీరోగా... రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ద్వారానే రష్మిక హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయ్యింది. కొద్ది రోజుల క్రితం ఓ ప్రైవేట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటిగా తన ప్రస్థానం గురించి వివరించింది రష్మిక మందన్న. అయితే తనకు తొలి సినిమా అవకాశం ఇచ్చిన సంస్థ పేరు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు.
. 'కాంతార' సినిమా విషయంలో తనపై కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. "కాంతార' సినిమా చూసిన వెంటనే చిత్ర బృందానికి మెసేజ్ పెట్టాను. నా వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు ఏమాత్రం అవసరం లేదు. అయితే వృత్తిపరంగా మాత్రం నేను ఏం చేస్తున్నానో ప్రజలకు తెలియజేయడం తన బాధ్యత అంటూ క్లారిటీ ఇచ్చింది రష్మిక.