Anchor Rashmi: జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. ఇదంతా వాళ్ల ప్లానే అంటూ రష్మీ ఓపెన్
Anchor Rashmi: జబర్దస్త్‌కి కొత్త యాంకర్.. ఇదంతా వాళ్ల ప్లానే అంటూ రష్మీ ఓపెన్
Rashmi Gautam: రష్మీని జబర్దస్త్ నుంచి తప్పించడంపై ఆమె సీరియస్ గా ఉండనే కథనాలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూపై రష్మీ రియాక్ట్ అయింది. జబర్దస్త్ కొత్త యాంకర్ గా సౌమ్య రావు రావడంపై ఆమె స్పందించింది.
బుల్లితెరపై భారీ డిమాండ్ ఉన్న షో జబర్దస్త్. అన్ని వయసుల ఆడియన్స్‌ని కితకితలు పెడుతూ భారీ టీఆర్ఫీ సాధిస్తున్న ఈ షో.. గత ఏడెనిమిదేళ్ళుగా అదే హవా కొనసాగిస్తోంది. కమెడియన్లు, జడ్జ్‌లు మారుతూ వస్తున్నా యాంకర్ల ట్రెండ్ మాత్రం కంటిన్యూ అయింది.
2/ 8
కొన్నేళ్ల పాటు జబర్దస్త్ వేదికపై హంగామా చేసిన యాంకర్ అనసూయ.. అనూహ్యంగా ఇటీవలే ఈ షో నుంచి తప్పుకుంది. అనసూయ తప్పుకోవడంతో ఆ ప్లేస్ లో వేరే యాంకర్ వస్తుందని అంతా అనుకున్నారు. పులువురు పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి.
3/ 8
కానీ ఊహించని విధంగా ఇప్పటికే ఎక్స్ట్రా జబర్దస్త్ హ్యాండిల్ చేస్తున్న యాంకర్ రష్మీనే జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారు. దీంతో ఈ రెండు షోస్‌కి యాంకర్ గా వ్యవహరిస్తూ హంగామా చేస్తోంది రష్మీ.
4/ 8
ఈ నేపథ్యంలో రీసెంట్ గా జబర్దస్త్ కొత్త యాంకర్ గా సౌమ్య రావును పరిచయం చేసింది మల్లెమాల టీం. అనూహ్యంగా ఈ కొత్త యాంకర్ ని చూసి జనం షాకయ్యారు. ఇంతకీ ఎవరీ సౌమ్య రావు అని అంతర్జాలంలో వెతకడం ప్రారంభించారు.
5/ 8
ఇదిలాఉంటే రష్మీని జబర్దస్త్ నుంచి తప్పించడంపై ఆమె సీరియస్ గా ఉండనే కథనాలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఇష్యూపై రష్మీ రియాక్ట్ అయింది. జబర్దస్త్ కొత్త యాంకర్ గా సౌమ్య రావు రావడాన్ని స్వాగతిస్తున్నా అంటూ అసలు విషయాలు బయటపెట్టింది రష్మీ.
6/ 8
తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన ఆమె.. జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్య రావుపై తనకు ఎలాంటి నెగెటివ్ ఒపీనియన్ లేదని చెప్పింది. ఆమె రాకను మల్లెమాల వారు తనకు ముందే చెప్పారని తెలిపింది.
7/ 8
అనసూయ వెళ్లిపోయిన తర్వాత కొద్దిరోజుల కోసమే తనను జబర్దస్త్ యాంకర్ గా తీసుకున్నారని, కొద్ది రోజుల తర్వాత వేరే యాంకర్ వస్తుందని తనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని రష్మీ చెప్పుకొచ్చింది. మల్లెమాల తనకు హోమ్ ప్రొడక్షన్ లాంటిదని రష్మీ చెప్పింది.
8/ 8
సౌమ్య రావు విషయానికొస్తే.. ఈ టీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ యాక్టర్ ఆమె. మొన్నటికి మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో తనదైన పంచులతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ సౌమ్య రావు. చూడాలి మరి యాంకర్ రష్మీ స్థానంలో వచ్చిన ఈ యంగ్ లేడీ జబర్దస్త్ వేదికపై ఏ మేర సందడి చేస్తుందనేది!.