Rashmi Gautam : తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. (Instagram/Photo)
ఇక ఇదే విషయంలో తాజాగా ట్విట్టర్ వేదికగా రష్మి ఆ మధ్య స్పందించారు. బ్రూనో అనే ఓ కుక్క విషయంలో భాగంగా కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటీ చేష్టలు ఏంటనీ ప్రశ్నించారు రష్మి. వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు 'బ్రూనో' అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి క్రూరంగా కొడుతూ చావబాది చంపేశారు. Photo : Instagram
ఇక రష్మి ఓ వైపు ఈ టీవీలో వచ్చే జబర్దస్త్, ఢీ షోలకు యాంకరింగ్ చేస్తూనే.. నందు హీరోగా వస్తోన్న ఓ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాఠ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే పేరు పెట్టింది చిత్రబృదం. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్రవీణ్ పగడాల నిర్మించాడు. Photo : Instagram
రష్మీ హీరోయిన్గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు. ఓ వైపు టీవీల్లో యాంకరింగ్, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం రష్మీ కెరీర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఇందులో టీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించాడు. Photo : Instagram