Home » photogallery » movies » RASHI KHANNA DO NOT MAKE THAT TYPE OF MISTAKES TA

మరోసారి ఆ తప్పు చేయను కాక చేయనంటున్న రాశి ఖన్నా..

Raashi Khanna | బొద్దుగుమ్మ నుంచి ముద్దుగుమ్మగా మారిన రాశి ఖన్నా.. తన సినిమాల విషయంలో ఆచితూచి సినిమాలు చేస్తూ వస్తోంది. కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అందాల ఆరబోత విషయంలో రాశి ఖన్న పెద్దగా హద్దులు దాటింది లేదు. అలాంటిది విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కోసం ఏకంగా బోల్డ్ సన్నివేశాల్లో నటించిన అభిమానులకు షాక్ ఇచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా విడుదల కాకముందే.. ట్రైలర్‌తో రాశీఖన్నా సంచలనం రేపింది. ఇదే విషయాన్ని రాశీఖన్నాను సినిమా విడదలకు ముందు ప్రశ్నిస్తే.. అక్కడ మీరు చూడాల్సింది ఎమెషన్. అందుకే తగ్గట్టే నటించాను. బోల్డ్ నెస్  చూడకూడదు అంటూ కవరింగ్ ఇచ్చింది. ఇంతా చేస్తే ఫలితం మాత్రం బోడి సున్నా అంటూ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. రాశి ఖన్నా చేసినదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. చివరకు అభిమానుల ట్రోల్స్‌కు గురైంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదని ఇపుడు బాధపడుతోంది ఈ అమ్మడు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో హీరోయిన్‌గా రాశీ ఖన్నాపై బ్యాడ్ ఇంప్రెషన్ పడిపోయింది. అందుకేనేమో రాశిఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో బోల్డ్ నెస్ ఉన్న క్యారెక్టర్ చేసి పెద్ద తప్పు చేసినట్టు చెంపలు వాయించుకుంది. ఇక ముందు ఇలాంటి పాత్రలు చేయను కాక చేయనంటుంది ఈ అమ్మడు. ఇక నుంచి పాత్రల ఎంపికలో ఒళ్లు దగ్గర పెట్టుకొని సెలెక్ట్ చేసుకుంటా అని చెబుతోంది. మొత్తానికి గట్టి ఎదురు దెబ్బ తగిలితే కానీ.. రాశిఖన్నాకు తత్వం బోధ పడలేదని అందరు చెప్పుకుంటున్నారు.