దీపికా చెప్పులు మోసిన రణ్‌వీర్ సింగ్.. వైరల్ అవుతున్న వీడియో..

గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణేలు, ఆ తర్వాత వాళ్ల ప్రేమ బంధం పెళ్లితో ముడివేసి ఒకటయ్యారు. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లిన జంటగా వెళుతున్నారు. ఇక రణ్‌వీర్ కూడా దీపికా పాదాలు కందకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. తాజాగా ఒక పెళ్లిలో దీపికా చెప్పులు తెగిపోతే.. రణ్‌వీర్ స్యయంగా ఆ చెప్పులను మోసుకుంటూ తిరిగాడు. ఇపుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.