Sourav Ganguly Biopic: సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో స్టార్ హీరో.. అతను ఎవరంటే ?
Sourav Ganguly Biopic: సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో స్టార్ హీరో.. అతను ఎవరంటే ?
ఇప్పటికే పలువురు సెలబ్రిటీల బయోపిక్‌లు తెరకెక్కించారు. అందులో క్రికెట్ హీరోలు కూడా ఉన్నారు.ధోని, కపిల్ దేవ్ వంటి స్టార్ క్రికెటర్ల జీవితం ఆధారంగా సినిమాలు తెరకెక్కించారు. ఇప్పుడు గంగూలీ వంతు. సౌరబ్ గంగూలీ గురించి క్రికెట్ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు త్వరలో గంగూలీ బయోపిక్ రానుంది.
సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి దాదా పాత్ర కోసం అన్వేషణ సాగింది. ఈ పాత్ర కోసం హృతిక్ రోషన్, సిద్ధార్థ్ మల్హోత్రా సహా పలువురి పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రణబీర్ చేతిలో ఉందని ఈ-టైమ్స్ నివేదించింది.
2/ 8
ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ప్రకారం, బ్రహ్మాస్త్ర నటుడు రణబీర్ కపూర్ త్వరలో ఈ సినిమా షూటింగ్ కోసం కోల్‌కతాకు వెళ్లనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే రణబీర్ కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.
3/ 8
కోల్‌కతాను సందర్శించిన రణబీర్ మొదట ఈడెన్ గార్డెన్, CAB కార్యాలయం మరియు సౌరవ్ గంగూలీ ఇంటిని సందర్శించనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు
4/ 8
సౌరవ్ గంగూలీ బయోపిక్ 2019లో ప్రకటించబడింది. గత నెలలో, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బయోపిక్ గురించి మాట్లాడారు. బయోపిక్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
5/ 8
సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఏ హీరో బెస్ట్ అని డోనా గంగూలీని ఈ-టైమ్ ప్రశ్నించింది. దీనికి డోనా సమాధానమిస్తూ.. ఈ ప్రశ్నకు దర్శకులు, నిర్మాతలు మాత్రమే అత్యుత్తమ సమాధానం చెప్పగలరని అన్నారు.
6/ 8
సౌరవ్గా తెరపై ఏ హీరోని.... ఎవరిని చూడాలనుకుంటున్నారని ఆయన భార్య డోనా గంగూలీని అడిగినప్పుడు, ఆమె తన అభిప్రాయాన్ని చెబుతూ.. తాను అయితే .. ఆ స్థానంలో అమితాబ్ బచ్చన్ లేదా షారుఖ్ ఖాన్ పేర్లను చెబుతాను అని పేర్కొన్నారు.
7/ 8
కానీ అమితాబ్ మరియు షారూఖ్‌లు వారి వయస్సు ప్రకారం 24 ఏళ్ల సౌరవ్ గంగూలీలా కనిపించలేరని కూడా ఆమె రెప్పారు. అయితే ఈ సినిమా కథ కూడా ఈ టైమ్ ఫ్రేమ్ చుట్టూనే తిరుగుతుంది. అందుకే వయసుకు తగ్గట్టుగా మెరుగ్గా ఉండాలని అంటున్నారు.
8/ 8
రణబీర్ కపూర్ కూడా సౌరవ్ గంగూలీగా కనిపించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రణబీర్ కపూర్ నటించిన తు ఝూటీ మై మక్కర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోలీ పండుగ రోజు మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.