Alia Bhatt: ఆలియా భట్ కూతురుకు అప్పుడే అన్ని జతల చెప్పులా ..!
Alia Bhatt: ఆలియా భట్ కూతురుకు అప్పుడే అన్ని జతల చెప్పులా ..!
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆళియా భట్.. రణ్ బీర్ కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.ఈ జంట పెళ్లైన కొన్ని నెలలకే తల్లిదండ్రులుగా మారారు. రాహా అనే కూతురుకు జన్మనిచ్చింది ఆలియా . తాజాగా రణ్ బీర్ మాట్లాడుతూ.. రాహాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రణబీర్ కపూర్ అలియా భట్ గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఏడాదిలోనే.. ఒక పాపకు తల్లిదండ్రులుగా కూడా మారారు. తమ కూతురు రాహా కపూర్ జీవితంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది ఈ జంట, . స్టార్ నటులిద్దరూ తమ కూతురి సంరక్షణలో బిజీగా ఉన్నారు.
2/ 8
తాజాగా రణ్’బీర్ కపూర్ రాహాకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. తన కూతురి చిరునవ్వు ముఖాన్ని విడిచిపెట్టి షూటింగ్‌కు రావడం చాలా బాధ కలిగించిందన్నారు రణ్ బీర్.
3/ 8
తన కూతురు రాహా గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కుమార్తె రాహా తన వద్ద ఇప్పటికే 30 జతల బూట్లు ఉన్నాయని వెల్లడించారు.
4/ 8
ఆలియా తన కూతుర్ని పెంచడం విషయంలో చాలా బిజీగా ఉందన్నాడు. ప్రస్తుతం రాహా దగ్గర ఉన్న 30 జతల చెప్పులు ఏవీ కూడా రాహా పాదాలకు సరిపోవుని తెలిపాడు. ఆమె వాటిని ధరించడం కోసం వెయిట్ చేస్తుందని తెలిపాడు. రాహా అచ్చం ఆలియాలాగానే ఉంటుందన్నాడు రణ్ బీర్.
5/ 8
రణ్‌బీర్ కపూర్ తూ జూటీ మే మక్కర్ సినిమాలో నటించాడు. మార్చి 8న సినిమా విడుదలైంది. మంచి స్పందన వస్తోంది. తల్లి అయిన తర్వాత తొలి షూటింగ్ కోసం అలియా భట్ కాశ్మీర్లో ఉంది.
6/ 8
ఇక ఆలియా రణవీర్ సింగ్ సరసన రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ చిత్రంలో నటిస్తోంది. ట్రిపుల్ ఆర్ సినిమాలో ప్రత్యేక పాత్రలో ఆలియా మెరిసిన విషయం తెలిసిందే.
7/ 8
జగ్గా జాసూస్ రాహా చూడాల్సిన సినిమా అని రణబీర్ అన్నారు. ఇది కిడ్స్ ఫ్రెండ్లీ మూవీ అని రణ్ బీర్ తెలిపాడు. రణ్ బీర్ గంగూలీ బయోపిక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే అతడు గంగూలీని కూడా కలిశాడు.
8/ 8
ఇక ఆలియా భట్ ఆర్ఆర్ఆర్లో సీత పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ అవార్డు రేసులో ఉన్న విషయం తెలిసిందే. రేపు ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరగనుంది. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.