Urfi Javed: ఉర్ఫీ జావెద్ బట్టలపై రణ్ బీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు.. !
Urfi Javed: ఉర్ఫీ జావెద్ బట్టలపై రణ్ బీర్ కపూర్ కీలక వ్యాఖ్యలు.. !
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ పై కీలక వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. ఉర్ఫీ తన రకరకాల డ్రెస్సులతో వార్తాల్లోకి ఎక్కింది. ఎప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి... ఉర్ఫీ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ పై ట్రోలింగ్ కూడా గురవుతుంటుంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ గురించి తెలిసిందే. ఈ హీరో ఇటీవలే బ్రహ్మస్త్ర సినిమాలో నటించాడు. తెలుగులో కూడా ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చి సందడి చేశాడు. ఇప్పుడు తు ఝూటీ మై మక్కార్ సినిమాతో అందర్నీ మరోసారి థియేటర్లలో కలిశాడు.
2/ 7
బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ గురించి కూడా అందరికీ తెలిసిందే. ఆమె ఫ్యాషన్‌తో బాగా ఫేమస్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ నటులు కూడా ఉర్ఫీతో సుపరిచితులే, నటి ఫ్యాషన్ ఎక్కడివరకు చేరిందో చెప్పడానికి ఇది నిదర్శనం.
3/ 7
ఉర్ఫీ ఫ్యాషన్ పై రణ్ బీర్ పలు కామెంట్లు చేశాడు. ఆమె ఫ్యాషన్ చెడు గా ఉందని నటుడు రణ్ బీర్ అన్నారు. కరీనా కపూర్‌తో జరిగిన చాట్ షోలో ఆయన దీనిపై స్పందించారు.
4/ 7
అలాంటి ఫ్యాషన్‌పై తనకు ఆసక్తి లేదు అని రణబీర్ చెప్పాడు. కానీ మనం ఎక్కడ సుఖంగా ఉన్నామో అలాంటి ప్రపంచంలోనే మనం హ్యాపీగా జీవించ గలమన్నాడు.
5/ 7
ఇది మంచి టేస్టా లేదా బ్యాడ్ టేస్ట్ అని కరీనా మరోసారి ప్రశ్నించగా, నటుడు అది బ్యాడ్ టేస్ట్ అని సమాధానం ఇచ్చాడు.
6/ 7
ఉర్ఫీ తన ఫ్యాషన్‌కు ప్రసిద్ధి చెందింది. ఎప్పుడూ కొత్తదనాన్ని ప్రయత్నిస్తు ఉంటుంది. తాను వేసుకున్న డ్రెస్సులతోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది.
7/ 7
అయితే నెటిజన్లు మాత్రం ఉర్ఫీ జావెద్ గురించి ఇప్పుడు రణ్ బీర్ కూడా మాట్లాడాడని అది ఆమె గొప్పతనం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.